
అటవీ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలి
మహబూబాబాద్ రూరల్: అటవీ భూమి అన్యాక్రాంతం కాకుండా ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని భద్రాద్రి కొత్తగూడెం సీసీఎఫ్ భీమానాయక్ అన్నారు. అటవీ సంరక్షణపై జిల్లా పరిధిలోని గూడూరు డబ్ల్యూఎల్‌ఎం డివిజన్, మహబూబాబాద్ డివిజన్ పరిధిలోని అటవీ శాఖ సిబ్బందితో మంగళవారం స్థానిక రైతు వేదికలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా భీమానాయక్ హాజరై మాట్లాడుతూ.. అటవీ భూమి అన్యాక్రాంతం కాకుండా ప్రతీరోజు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. ఎవరైనా అటవీ భూమి అన్యాక్రాంతం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జా రీ చేశారు. డీఎఫ్‌ఓ విశాల్ బత్తుల, ఎఫ్‌డీఓ వెంకటేశ్వర్లు, అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం
సీసీఎఫ్ భీమానాయక్