
మహిళలు సంఘటితంగా ఉద్యమించాలి
నెహ్రూసెంటర్: మహిళలు తమ హక్కుల సాధన, చట్టాల అమలు కోసం సంఘటితంగా ఉద్యమాలు చేపట్టాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. సంఘం జిల్లా రెండో మహాసభను కవిత, భాగ్యమ్మ అధ్యక్షతన జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని, రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, మహిళా చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళా వైద్యులను నియమించాలని కోరారు. ఈ సభలో సంఘం రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, నలగంటి రత్నమాల, మహిళలు పాల్గొన్నారు.
నూతన కమిటీ..
ఐద్వా మహబూబాబాద్ జిల్లా నూతన కమిటీని 21మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా కందునూరి కవిత, ప్రధాన కార్యదర్శిగా గాడిపెల్లి ప్రమీల, సహాయ కార్యదర్శిగా చాగంటి భాగ్యమ్మ ఎన్నికయ్యారు.