Telangana: Man Loses Rs 25000 In Online Fraud In Mahmudabad - Sakshi
Sakshi News home page

ఐ ఫోన్‌ గెలుచుకున్నావు..! అంతలోనే..!!

Jul 22 2023 1:36 AM | Updated on Jul 22 2023 1:30 PM

- - Sakshi

మహబూబాబాద్‌: ఐ ఫోన్‌ గెలుచుకున్నావంటూ మొబైల్‌కు మెసేజ్‌..కాల్‌ రాగా దీనిపై ఓ యువకుడు స్పందించి సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి రూ.29వేలు పోగొట్టుకున్న ఘటన శుక్రవారం సాయంత్రం ఖిలావరంగల్‌లో వెలుగుచూసింది. బాధితుడి కథనం ప్రకారం మధ్యకోటకు చెందిన హైమద్‌ అలీ మొబైల్‌కు శుక్రవారం సైబర్‌నేరగాడు 7837905596 నంబర్‌ను నుంచి మేసేజ్‌.. ఆ తర్వాత కాల్‌ వచ్చింది. తనయుడి చేతిలో ఉన్న తండ్రి మొబైల్‌కు వచ్చిన మేసేజ్‌పై వెంటనే యువకుడు స్పందించాడు.

మీకు ఐ పాడ్‌ మొబైల్‌ గెలుచుకున్నావంటూ మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ చెప్పాలని సైబర్‌ నేరగాడు కాల్‌ చేసి అడిగాడు. ఆ యువకుడు ఆనందంతో ఓటీపీ చెప్పాడు. క్షణాల్లోనే తండ్రి బ్యాంకు ఖాతా నుంచి రూ.29 వేల నగదు మాయమైనట్లు మెసేజ్‌ వచ్చింది. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కానని బ్యాంకు ఖాతాను బ్లాక్‌ చేసుకున్నాడు. శుక్రవారం సాయంత్రం మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు హైమద్‌ అలీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement