మున్సిపాలిటీల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం
● రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
తొర్రూరు: మున్సిపాలిటీల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తొర్రూరు మున్సిపాలిటీలో 1, 2 వార్డుల కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి పొంగులేటి శనివారం ప్రచారం నిర్వహించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డిలతో కలిసి మంత్రి మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేస్తుందని అన్నారు. అభివృద్ధి జరగాలంటే అధి కార పార్టీ అభ్యర్థులు గెలవాలని, ప్రతిపక్షాలతో ఒరిగేదేమి లేదన్నారు. తొర్రూరును దత్తత తీసుకు ని అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. ప్రతి ఏప్రిల్‌లో పేదలకు ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. తొ ర్రూరు పట్టణ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేస్తామన్నారు. తిరుపతిరెడ్డి, హరిప్రసాద్, హామ్యానాయక్, నిరంజన్‌రెడ్డి, కిషోర్‌రెడ్డి పాల్గొన్నారు.


