పైకమే ప్రధానం
సాక్షి, మహబూబాబాద్: ‘గత ఎన్నికల్లో నేను పోటీ చేశాను.. తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయాను.. కౌన్సిలర్ కావాలన్న కోరిక నెరవేరలేదు.. ఇప్పుడు నాకు అనుకూలంగా రిజర్వేషన్ రాలేదు.. అయినా నా భార్యను బరిలో దింపుతున్నాను.. ఎన్ని డబ్బులైనా సరే.. పోటీలో ఉంటాం.. ఎంత ఖర్చయినా.. కౌన్సిలర్ పదవికి దక్కించుకుంటా..’ అని ఓ పార్టీ అభ్యర్థి చెబుతుండగా.. ‘ఆయన కన్నా తక్కువేం కాదు.. మన పార్టీ నుంచి కూడా అంతే మొత్తంలో ఖర్చుపెట్టే సామర్థ్యం ఉన్న అభ్యర్థినే పోటీలో దించాలి..’ అంటూ వివిధ రాజకీయ పార్టీల నేతలు నిర్ణయాలు తీసుకోవడం ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆర్థిక బలమే కీలకం..
జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం 98 వార్డులు ఉన్నాయి. ఆయా పార్టీలు అభ్యర్థులకు వార్డుల్లో ఉన్న మంచిపేరుతోపాటు.. వారి ఆర్థిక బలంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు చర్చ జరుగుతుంది. ఒక్కో వార్డుకు రూ.20 లక్షలకు నుంచి రూ.70 లక్షలు దాటే అవకాశం ఉండడంతో అంతమొత్తంలో ఖర్చు చేసేవారినే అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు తెలు స్తుంది. అయితే ప్రత్యర్థుల ఆర్థిక పరిస్థితిని గమనించి ఇతర పార్టీల నుంచి ధీటైన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. దీనికి గమనించిన పలు వురు ఆశావహులు తమ వద్ద ఉన్న బ్యాంకు బ్యా లెన్స్, నోట్ల కట్టలను చూపించడం.. మీ దగ్గర ఉంచుకోండి.. మీరు ఎంత ఖర్చుపెట్టమంటే అంత ఖర్చు పెడతాను.. కానీ పార్టీ బీ ఫామ్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. అయితే కౌన్సిలర్‌గా పోటీ చేయాలనే ఆలోచనతో నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. చేదోడు వాదోడుగా పనులు చేస్తున్న నాయకులు కొందరు డబ్బుల విషయంలో వెనక్కి తగ్గా రు.. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టే స్తోమత లేదని స్వ చ్ఛందంగానే తప్పుకొని ఇతరులకు మద్దతు తెలు పుతున్నారు. రూ.లక్షల్లో ఖర్చు చేసి ఓటమిపాలైతే అప్పులు మిగిలి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ స్తుందనే ఆలోచనలో మెజార్టీ నాయకులు ఉ న్నట్లు తెలుస్తుంది. ఏదిఏమైనప్పటికి అభ్యర్థుల మంచి, చెడు కన్నా.. ఎన్ని డబ్బులు ఉన్నాయి.. ఎంత ఖ ర్చు పెడతారు.. అభ్యర్థి వెనక ఎంత మంది డబ్బున్నవాళ్లు ఉన్నారు.. అనేదే కీలకంగా మారింది.
‘మున్సిపల్’ అభ్యర్థులకు తప్పనితిప్పలు
సర్వేచేసి టికెట్ ఇస్తున్న ప్రధాన పార్టీలు
ఎదుటి వారి ఆర్థిక స్థోమతకు ధీటుగా అభ్యర్థుల ఎంపిక
తగ్గేదే లేదంటూ..
పోటీకి సిద్ధమైన అభ్యర్థులు
ముందుగా సర్వే నిర్వహించి..
మున్సిపాలిటీ ఏర్పాటు తర్వాత మూడోసారి ఎన్నికలు జరిగే మహబూబాబాద్, రెండో సారి ఎన్నిక జరిగే తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌తోపాటు, మొదటిసారి ఎన్నికలు జరిగే కేసముద్రం మున్సిపాలిటీలో ఎక్కువ సంఖ్యలో వార్డులు గెలిపించుకుని చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్‌తోపాటు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే వార్తలు రాగానే.. వార్డుల వారీగా టికెట్ ఆశించే అభ్యర్థులు వార్డుల్లో తిరగడం మొదలు పెట్టారు. అయితే రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో తమ ఉన్న వార్డులు కాకుండా.. వేరే వార్డుకు వెళ్లి పోటీ చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితిలో టికెట్ ఇచ్చేందుకు అభ్యర్థుల బలాబలాలపై పార్టీలు ముందస్తు సర్వేలు నిర్వహించడం గమనార్హం.
పైకమే ప్రధానం


