నామినేషన్ల పరిశీలన పూర్తి | - | Sakshi
Sakshi News home page

నామినేషన్ల పరిశీలన పూర్తి

Feb 1 2026 3:35 AM | Updated on Feb 1 2026 3:35 AM

నామినేషన్ల పరిశీలన పూర్తి

నామినేషన్ల పరిశీలన పూర్తి

మహబూబాబాద్‌: మానుకోట మున్సిపాలిటీ పరిధి లో 36 వార్డులు ఉండగా 357 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో వివిధ కారణాలతో 127 నామి నేషన్లు తిరస్కరణకు గురైనట్లు కమిషనర్‌ రాజేశ్వర్‌ శనివారం తెలిపారు. తిరస్కరణ అనంతరం 230 నామినేషన్లు ఉన్నట్లు పేర్కొన్నారు. తిరస్కరించిన నామినేషన్లపై ఈనెల 1న అభ్యంతరాల పరిశీలన, 2న వార్డుల వారీగా జాబితా ప్రదర్శన, 3న సాయంత్రం మూడు గంటల వరకు ఉపసంహరణ అదేరోజు బరిలో ఉండే అభ్యర్థుల జాబితా ప్రదర్శన ఉంటుందని కమిషనర్‌ తెలిపారు.

102 నామినేషన్లకు ఆమోదం

డోర్నకల్‌: స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్‌ నామినేషన్ల పరిశీలన శనివారం పూర్తయింది. 15 వార్డుల్లో పోటీకి 146 నామినేషన్లు దాఖలు కాగా.. పరిశీలించిన అధికారులు 102 నామినేషన్లను ఆమోదించినట్లు ప్రకటించారు. మిగిలిన నామినేషన్లను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు.

16 వార్డులకు 144 నామినేషన్లు

తొర్రూరు: తొర్రూరు మున్సిపల్‌ ఎన్నిక ప్రక్రియలో భాగంగా 144 నామినేషన్లు దాఖలయ్యాయని శనివారం పరిశీలించినట్లు కమిషనర్‌ శ్యాంసుందర్‌ తెలిపారు. కాగా అన్ని నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని ప్రకటించారు.

మూడు నామినేషన్ల తిరస్కరణ

మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీలో 15 వార్డులకు 142 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో శనివారం పరిశీలన అనంతరం మూడు నామినేషన్లు తరస్కణకు గురైనట్లు అధికారులు వెల్లడించారు.

కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డులకు 167 నామినేషన్లు దాఖలయ్యాయని.. శనివారం పరిశీలించామని కమిషనర్‌ శ్రీనివాసరావు తెలిపారు. దాఖలైన నామినేషన్లు అన్నీ సక్రమంగానే ఉన్నట్లు ఆయన ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement