బీసీలకు జెడ్పీ పీఠం | - | Sakshi
Sakshi News home page

బీసీలకు జెడ్పీ పీఠం

Oct 14 2026 4:23 AM | Updated on Oct 14 2026 4:23 AM

జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ !

ఎట్టకేలకు జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ల ఖరారు

కొనసాగుతున్న ఎంపీటీసీ, సర్పంచ్‌, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ

నేటి సాయంత్రానికి కొలిక్కి వచ్చే అవకాశం

కర్నూలు(అర్బన్‌): జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిని బీసీలకు కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి గెజిట్‌ విడుదల చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్‌ ప్రారంభమైనప్పటి నుంచి బీసీలకు రిజర్వు కావడం ఇది నాల్గవ పర్యాయం. 1981, 2001, 2014లో బీసీలకు రిజర్వు కాగా.. తాజాగా ఇప్పుడు జెడ్పీ చైర్మన్‌ పీఠం బీసీలకు రిజర్వు అయ్యింది. 1959 నుంచి 2026 వరకు 16 మంది జెడ్పీ చైర్మన్లుగా పనిచేశారు. వీరిలో బీసీ వర్గాలకు చెందిన కేఈ క్రిష్ణమూర్తి, బత్తిన వెంకటరాముడు, మల్లెల రాజశేఖర్‌ చైర్మన్లుగా పనిచేశారు. కాగా జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జెడ్పీ చైర్మన్‌ పదవి బీసీ జనరల్‌కు రిజర్వు కావడంతో ఏఏ మండలాలకు చెందిన జెడ్పీటీసీ స్థానాలు బీసీలకు రిజర్వు అయ్యాయనే అంశంపై సస్పెన్స్‌ మంగళవారం రాత్రి వరకు కొనసాగింది. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు జెడ్పీ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లాకు చెందిన ఆర్‌డీఓ, డీడీఓ, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలు మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు స్థానిక జెడ్పీ మినీ సమావేశ భవనంలో తీవ్ర కసరత్తు చేపట్టారు. జనాభా వివరాలు, ఓటరు జాబితాలను పరిశీలించి ఎక్కడా తప్పులు జరగకుండా రిజర్వేషన్లను పూర్తి చేశారు. అలాగే జిల్లాలోని 484 గ్రామ పంచాయతీలు, 5,100 వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. గ్రామ పంచాయతీలపై ఈ నెల 14వ తేది సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

● కర్నూలు జిల్లాలో మొత్తం 26 జెడ్పీటీసీ, 26 ఎంపీపీ స్థానాలు ఉండగా, ఇందులో 5 ఎస్సీలకు, 8 బీసీలకు, 13 అన్‌ రిజర్వుడుగా ప్రకటించారు. అలా గే ఎంపీపీ స్థానాలకు సంబంధించి 5 ఎస్సీ, 8 బీసీ, 13 అన్‌రిజర్వుడ్‌ స్థానాలుగా ప్రకటించారు.

మండలాల వారీగా ఎంపీపీ రిజర్వేషన్లు

ఎస్సీ జనరల్‌ : నందవరం, వెల్దుర్తి

ఎస్సీ మహిళ : సి.బెళగల్‌, గోనెగండ్ల, కర్నూలు

బీసీ జనరల్‌: దేవనకొండ, హాలహర్వి, కోడుమూరు, పెద్దకడుబూరు

బీసీ మహిళ: కోసిగి, క్రిష్ణగిరి, పత్తికొండ, ఎమ్మిగనూరు

అన్‌ రిజర్వుడ్‌: ఆలూరు, ఆస్పరి, చిప్పగిరి, గూడూ రు, కల్లూరు, మద్దికెర, తుగ్గలి, ఆదోని–1, ఆదోని–2, హొళగుంద, కౌతాళం, మంత్రాలయం, ఓర్వకల్లు

మండలాల వారీగా జెడ్పీటీసీ రిజర్వేషన్లు

ఎస్సీ జనరల్‌ : ఆలూరు, ఎమ్మిగనూరు

ఎస్సీ మహిళ : గూడూరు, కల్లూరు, ఓర్వకల్లు

బీసీ జనరల్‌ : ఆదోని–1, ఆస్పరి, గోనెగండ్ల, కౌతాళం

బీసీ మహిళ : ఆదోని–2, చిప్పగిరి, మద్దికెర, నందవరం

అన్‌ రిజర్వుడ్‌ జనరల్‌ : సి.బెళగల్‌, హొళగుంద, కోసిగి,క్రిష్ణగిరి, మంత్రాలయం, పత్తికొండ, పెద్దకడుబూరు

అన్‌ రిజర్వుడ్‌ మహిళ : దేవనకొండ, హాలహర్వి, కోడుమూరు, కర్నూలు, తుగ్గలి, వెల్దుర్తి

అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement