15 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరిక | - | Sakshi
Sakshi News home page

15 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరిక

Oct 14 2026 4:23 AM | Updated on Oct 14 2026 4:23 AM

ఎస్సీలను గౌరవించని

ఆదోని: నారాయణపురం గ్రామంలో బీజేపీకి చెందిన పలువురు నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి సమక్షంలో గ్రామ నాయకులు రామాంజనేయులు, రామలింగ ఆధ్వర్యంలో 15 కుటుంబాలు పార్టీలో చేరాయి. వారికి సాయిప్రసాద్‌ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గ్రామ నాయకుడు రామలింగం చిరంజీవి మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఎస్సీలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. గౌరవం లేని చోట కొనసాగడం వృథా అని భావించి బీజేపీని వీడినట్లు తెలిపారు. నారాయణపురం గ్రామాభివృద్ధి చెందుతుందని ఆశిస్తే ఎమ్మెల్యే నిరాశపర్చాడన్నారు. అభివృద్ధి వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కులమతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు.

బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement