ఎన్నికల హామీలపై నిలదీయండి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల హామీలపై నిలదీయండి

Oct 14 2026 4:23 AM | Updated on Oct 14 2026 4:23 AM

● ప్రజలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి పిలుపు

● ప్రజలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి పిలుపు

కర్నూలు(టౌన్‌): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై కూటమి నేతలను ప్రజలు నిలదీయా లని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం సాయంత్రం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇస్తామని ఎందుకు ఇవ్వడం లేదని టీడీపీ నేతలను నిలదీయాలన్నారు. జగనన్న కన్నా రెండింతల సంక్షేమ పథకాలు ఇస్తామని, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. మహిళలకు ప్రతి నెలా రూ. 1,500 ప్రకారం 28 నెలలకు ఒక్కొక్కరికి రూ.42 వేలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రతి నెలా రూ.3 వేలు ఇస్తామని ఇప్పటి వరకు ఒక్కొక్కరికి రూ.84 వేలు, 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నెలకు రూ.4 వేలు పెన్షన్‌ ఇస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఒక్కొక్కరికి రూ.1.12లక్షలు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు ప్రభు త్వం మోసం చేస్తోందన్నారు. ప్రతి ఏడాది 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి ఎగ్గొట్టారన్నారు. ప్రజా స్వామ్యంలో ప్రశ్నించడం ప్రజ ల హక్కు అని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీల అమలుపై ప్రజల అవగాహనతో ప్రశ్నించి తమ హక్కులు సాధించుకోవాలన్నారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement