● జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన
మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
కర్నూలు(సెంట్రల్): ఫ్యాక్షన్ గ్రామాల్లో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరిని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కోరారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. పత్తికొండ మండలంలో చక్రాళ్ల, పందికోన, పులికొండ, నలకదొడ్డి, పుచ్చకాయలమాడ, హోసూరు సమస్యాత్మకగ్రామాలుగా ఉన్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. మద్దికెర మండలంలోని బసినేపల్లి, మదనంతపురం, కృష్ణగిరి మండలంలోని బోయబొంతిరాళ్ల, చిట్యాల, కోయలకొండ, కంబాలపాడు, టీ గోకులపాడు, తొగర్చేడు, పోతుగల్లు గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. తుగ్గలి మండలంలోని శభాష్‌పురం, కడమకుంట్ల, బొందిమడుగుల, తుగ్గలి, వెల్దుర్తి మండలంలోని అల్లుగుండు, మల్లెపల్లె, బొమ్మిరెడ్డి పల్లె, పుల్లగుమ్మి, బోయినపల్లి, బోగోలులో వైఎస్సార్‌సీపీ నాయకులకు రక్షణ కల్పించాలని విన్నవించారు. ఆమె వెంట పార్టీ నాయకులు శ్రీరంగడు, శంకరరెడ్డి, మధుసూదన్‌రెడ్డి ఉన్నారు.


