● పీజీఆర్‌ఎస్‌కు పోటెత్తిన ప్రజలు
కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అర్జీలు తీసుకుని పీజీఆర్‌ఎస్‌కు ప్రజలు పోటెత్తుతున్నారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజల నుంచి అధికారులు వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి మాట్లాడుతూ.. నాణ్యతతో కూడిన పరిష్కారాలను అందించాలని అధికారులను ఆదేశించారు. సమస్యను వెంటనే పరిష్కరించడం సాధ్యం కాని పరిస్థితుల్లో అందుకు గల కారణాలను బాధితులకు వివరించాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటనారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ, రామసుబ్బయ్య, శివ ప్రసాద్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


