ఉగ్ర భానుడు | - | Sakshi
Sakshi News home page

ఉగ్ర భానుడు

Apr 15 2026 8:02 AM | Updated on Apr 15 2026 8:02 AM

కోడుమూరు, సంజామల

మండలాల్లో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి జిల్లాపై బానుడు విరుచుకుపడుతున్నాడు. మంగళవారం ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత మరింత పెరిగింది. కర్నూలు జిల్లా కోడుమూరులో 44.2, నంద్యాల జిల్లా సంజామలలో 44.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలు కావడం గమనార్హం. ఏప్రిల్‌ మొదటి పక్షంలోనే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటితే.. మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన నెలకొంది. అత్యధిక మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని, వడదెబ్బకు గురికాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement