హామీల అమలులో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

Apr 10 2026 10:21 AM | Updated on Apr 10 2026 10:21 AM

స్పాట్‌ కేంద్రం వద్ద నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

కర్నూలు సిటీ: అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా టీడీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాఫ్టో) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన సమస్యల సాధనలో భాగంగా మలి దశ ఉద్యమాన్ని తీవ్ర తరం చేసేందుకు గురువారం పదవ తరగతి మూల్యాంకన కేంద్రం వద్ద ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు, ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.హృదయరాజు, అప్టా రాష్ట్ర అధ్యక్షులు, ఫ్యాప్టో రాష్ట్ర కో–చైర్మన్‌, కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఇన్‌చార్జి కె.ప్రకాష్‌రావు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 12వ పీఆర్‌సీ నియమించి, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పాత పెన్షన్‌ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని, లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడబోమన్నారు. ఈ నెల 25, 26, 27 తేదిల్లో విజయవాడలో రిలే నిరహాక్షలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement