● వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి
కర్నూలు (టౌన్): మహిళలపై కనీస గౌరవం లేకుండా ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు చేయడం దారుణమని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి అన్నారు. కర్నూలులో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌హన్‌రెడ్డి ‘మావిగన్’ ప్రతిపాదనను తీసుకువచ్చారని, దీనిపై ప్రజలు, మేధావులు మద్దతు తెలియజేస్తున్నారన్నారు. అమరావతి రాజధాని అయితే వేల కోట్లు దోపిడీ చేసుకోవచ్చుననే దురాశతో పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అమరావతి రాజధానికి జగనన్న, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏనాడూ వ్యతిరేకం కాదని, ఆ పేరుతో దోపీడీకి వ్యతిరేకమన్నారు. భార్యకు, చెల్లికి తేడా తెలియని దౌర్భాగ్యస్థితిలో జర్నలిస్టు రాధాకృష్ణ ఉండటం సిగ్గుచేటైన విషయమన్నారు. ఆయన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేష్ ఖండించకపోవడం దారుణమన్నారు. మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఏబీఎన్ రాధాకృష్ణ ఉపసంహరించుకొని బేషరుతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. లేదంటే వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.


