కర్నూలు: మద్యం దుకాణాలు, బార్లలో కల్తీల నిరోధానికి తనిఖీలు విస్తృతం చేసి శాంపిల్స్ సేకరించాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఎకై ్సజ్ అధికారులను ఆదేశించారు. కర్నూలు, నంద్యాల ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్లతో బుధవారం నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రదేశాల్లో జాతరలు, పండుగల దృష్ట్యా పొరుగు రాష్ట్రాల మద్యం జిల్లాలోకి ప్రవేశించే అవకాశమున్నందున నిరంతరం నిఘాతో పాటు దాడులు కొనసాగించాలన్నారు. పాత కేసులలో దర్యాప్తును పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. నాటుసారా తయారీదారులకు బెల్లం విక్రయాలు జరుపుతున్న వ్యాపారులపై నిఘా ఉంచి బైండోవర్ చేయాలన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలన్నారు. అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు, కర్నూలు, నంద్యాల జిల్లాల ఎకై ్సజ్ అధికారులు మచ్చ సుధీర్ బాబు, రవికుమార్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణా రెడ్డి, రాముడు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.


