ఆలూరు రూరల్: ఏబీఎన్ రాధాకృష్ణ ‘చెత్త’పలుకులు మానుకొని మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి డిమాండ్ చేశారు. రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం ఆయన వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి స్థానిక అంబేడ్కర్ సర్కిల్‌లో నిరసన వ్యక్తం చేసి ఆంధ్రజ్యోతి పత్రికలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మావిగన్‌ను ప్రతిపాదించారన్నారు. ఇందుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో జీర్ణించుకోలేని రాధాకృష్ణ తప్పుడు వ్యాఖ్యలతో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరోపని లేదన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు, ఈనాడు ఎల్లో మీడియా కూటమి కుల పిచ్చితో చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారన్నారు. అమరాతి పేరిట చంద్రబాబు అండ్ బ్యాచ్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. అమరాతి ప్రజల రాజధానిగా కాకుండా కమ్మ రాజధానిగా మారుతోందన్నారు. కారుకూతలు కూసిన రాధాకృష్ణ రాష్ట్రంలోని మహిళలందరికీ క్షమాపణ చెప్పే వరకు వైఎస్సార్‌సీపీ నేతలు, నాయకులు ఆందోళనలు కొనసాగిస్తారన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ మల్లికార్జున, వైఎస్సార్‌సీనీ నాయకులు చిన్న ఈరన్న, రామాంజినేయులు, ఎస్‌కే గిరి, వెంకటేషులు, ఎల్లప్ప, లక్ష్మిరెడ్డి, ఉరుకుందు, మారెప్ప, ఈరన్న, కో–ఆప్షన్ మెంబర్ బాషా పాల్గొన్నారు.


