ఖబడ్దార్‌.. ఒళ్లు దగ్గర పెట్టుకో! | - | Sakshi
Sakshi News home page

ఖబడ్దార్‌.. ఒళ్లు దగ్గర పెట్టుకో!

Apr 9 2026 8:11 AM | Updated on Apr 9 2026 8:11 AM

కల్లూరు: వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు వారి పెళ్లాలను చెల్లెలుగా అనుకొని వారికి సంబంధాలు చూడాలని వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్‌ రాధాకృష్ణా ఖబడ్దార్‌... ఒళ్లు దగ్గర పెట్టుకో అని వైఎస్సార్‌సీపీ శ్రేణులు హెచ్చరించాయి. వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం కర్నూలు నగరంలోని ఆంధ్రజ్యోతి ఎడిషన్‌ కార్యాలయం దగ్గర పార్టీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి శాంతియుతంగా నిరసన చేశారు. ఆంధ్రజ్యోతి పత్రులను దహనం చేశారు.

సిగ్గుమాలిన చర్య

వైఎస్సార్‌సీపీ జోనల్‌ విభాగం అధ్యక్షురాలు గాజుల శ్వేతారెడ్డి, కర్నూలు జిల్లా జాయింట్‌ సెక్రటరీ అక్కిమి హనుమంతురెడ్డి, తాజా మాజీ కార్పొరేటర్లు దండు లక్ష్మీకాంతరెడ్డి, అరుణ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సూర్యనారాయణరెడ్డి, మహిళలు ఏబీఎన్‌ రాధాకృష్ణా చెత్త పలుకుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అది జర్నలిజం కాదని, ముమ్మాటికీ బ్రోకరిజమని నినాదాలు చేశారు. చానల్‌, పేపర్‌కు యజమానిగా ఉన్న వ్యక్తి ఇటువంటి మాటాలు మాట్లాడడం సిగ్గు చేటన్నారు. సాధారణంగా పత్రికల్లో కథనాలు, వార్తాలు సమాజానికి మేలుకోలుపే విధంగా ఉండాలని, ఏబీన్‌ రాధాకృష్ణ మాత్రం మహిళల గురించి నీచంగా మాట్లాడారన్నారు. ఇంట్లో మహిళలకు కూడా ఈ మాటలు వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి దినప త్రిక టీడీపీకి కరపత్రికగా మారిందని విమర్శించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను, నాయకులు పోలీసులు అడుకోవడం దారుణమన్నారు. నిరసనలో తాజా మాజీ కార్పొరేటర్లు సుదర్శన్‌రెడ్డి, నాగలక్ష్మీరెడ్డి, నారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు తిరుపాల్‌, గోపాల్‌రెడ్డి, శివారెడ్డి, సాయి, హేమలత, మహేశ్వర్‌రెడ్డి, యూనస్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement