అద్దం లేకుండా దర్శనమిస్తున్న ఆర్టీసీ బస్సు కిటికీ
సా్థనిక ఆర్టీసీ డిపోలోని ఓ డొక్కు బస్సులో ప్రయాణం ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. కోవెలకుంట్ల నుంచి కర్నూలుకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సుకు ఒకవైపు కిటికీకి అద్దం లేకుండా రాకపోకలు సాగిస్తోంది. వేసవికాలం కావడంతో బస్సుకు అద్దం లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కోవెలకుంట్ల నుంచి కర్నూలుకు దాదాపు మూడు గంటల పాటు ప్రయాణం సాగించాల్సి ఉంది. సీట్లలో కూర్చొన్న ప్రయాణికులకు పగటివేళ నేరుగా ఎండ తాకుతుండటంతో సీట్లలో కూర్చోలేని పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు రద్దీగా ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో అలాగే రాకపోకలు సాగించాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
– కోవెలకుంట్ల


