నంద్యాల(వ్యవసాయం): గ్రామీణ ప్రాంత పేదలకు ఆర్‌ఎంపీలు పరిమితుల మేరకు ప్రాథమిక వైద్యం అందించాలని మూడవ జిల్లా జడ్జి లోక్‌ఆదాలత్ చైర్మన్ అమ్మన్న రాజా సూచించారు. మంగళవారం స్థానిక కోర్టు ఆవరణలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ఆర్‌ఎంపీలకు ఆరోగ్య విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్జి అమ్మన్నరాజా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు ఆర్‌ఎంపీలు విలువైన సేవలు అందిస్తున్నారన్నారు. కష్టతరమైన కేసులను ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేయాలన్నారు. సీపీఆర్, ఫస్ట్ ఎయిడ్ లాంటి అంశాలపై స్వచ్ఛంద సంస్థల ద్వారా శిక్షణ పొంది నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. సీనియర్ న్యాయవాది, జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు అమీర్ బాషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుస్సేన్ బాషా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, రెడ్‌క్రాస్ చైర్మన్ దస్తగిరి, ఆర్‌ఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి, రామచంద్రారెడ్డి భాస్కర్ పాల్గొన్నారు


