
సంతెకూడ్లూరులో ఘర్షణ
ఆదోని అర్బన్: సంతెకూడ్లూరు గ్రామంలో టీడీపీ, బీజేపీ వర్గీయుల మధ్య బుక్ కీపర్ విషయంలో శుక్రవారం ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీకి చెందిన మహేష్ భార్య గాయత్రీ బుక్ కీపర్‌గా పనిచేస్తోంది. గత నెల నుంచి ఆమెను తీసివేసి టీడీపీకి చెందిన వీరేష్ భార్య సువార్తమ్మను నియమించారు. ప్రస్తుతం టీడీపీకి చెందిన సువార్తమ్మ గ్రామంలో ఫేష్ యాప్ ద్వారా వివరాలు రికార్డు చేస్తున్నారు. బీజేపీకి చెందిన వారు ఎవరు ఫేష్ యాప్ చేసుకోవద్దని ప్రచారం చేసినట్లు తెలిసింది. ఇలా ప్రచారం చేయడం తెలుసుకున్న టీడీపీకి చెందిన వారు నేరుగా బీజేపీ వారిని నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. దాడిలో బీజేపీకి చెందిన మహేష్, టీడీపీకి చెందిన మదిరె వీరేష్‌కు గాయాలయ్యాయి. వెంటనే కుటుంబీకులు గాయపడిన వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంతెకూడ్లూరులో ఘర్షణ