వెండర్‌ టెండర్‌.. రూటే సప‘రేటు’ | - | Sakshi
Sakshi News home page

వెండర్‌ టెండర్‌.. రూటే సప‘రేటు’

Jun 6 2025 1:10 AM | Updated on Jun 6 2025 1:10 AM

వెండర్‌ టెండర్‌.. రూటే సప‘రేటు’

వెండర్‌ టెండర్‌.. రూటే సప‘రేటు’

స్టాంపులు కావాలంటే

రిజిస్ట్రేషన్‌ చలానాలు తన ఖాతా మీద

కట్టించాలని షరతు

కట్టకపోతే స్టాంపులు ఇవ్వకుండా

వేధింపులు

రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులకు

ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో అటు నాన్‌

జ్యుడీషియల్‌.. ఇటు ఈ–స్టాంపులు

దొరక్క విక్రయదారుల తీవ్ర ఇబ్బందులు

ర్నూలు, నంద్యాల, అనంతపురం, ప్రకాశం జిల్లాల(మార్కాపురం నియోజకవర్గం)కు సంబంధించిన ఈస్టాంపింగ్‌ వెండర్‌ టెండర్‌ను నర్సిరెడ్డి దక్కించుకున్నారు. అతడు తన వెండర్‌ ద్వారా క్రయ, విక్రయాదారులకు ఈస్టాంపులను సరఫరా చేయాల్సి ఉంది. అయితే తన ఖాతాలో రిజిస్ట్రేషన్లకు వినియోగించే చలాన్లను కూడా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ–స్టాంపులు, చలాన్ల విక్రయాలకు ప్రభుత్వం తగిన పరిహారం చెల్లిస్తుంది. అయితే ఈ–స్టాంపింగ్‌ల కంటే చలాన్లపైనే అతడికి కమిషన్‌ ఎక్కువగా ప్రభుత్వం చెల్లిస్తోంది. దీంతో తన దగ్గర ఈ–స్టాంపులు కావాలంటే రిజిస్ట్రేషన్లకు వినియోగించే చలాన్లను కూడా తన ఖాతా పేరిట కట్టించాలని షరతు విధిస్తున్నాడు. దీంతో కొందరు కొన్ని చలాన్లను కట్టించైనా తీసుకెళ్తున్నారు. కొందరు ఏమీ కట్టించకుండా స్టాంపులను కొనుగోలు చేసేందుకు వస్తుండడంతో కొర్రీ వేస్తున్నాడు. నాలుగు జిల్లాలపై దాదాపు 150 మందికి పైగా వెండర్లు ఉంటారు. వారందరూ అతని బాధితులే.

పెండింగ్‌లో రిజిస్ట్రేషన్‌ దరఖాస్తులు

ఈ–స్టాంపింగ్‌ వెండర్‌ కోసం వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్‌లు చేసుకున్నారు. వారికి వెండర్‌ పర్మిషన్‌ను అతడే ఇవ్వాలి. అయితే వచ్చిన అర్జీలను అతడు తొక్కి పెట్టి ఉన్న వెండర్లలో కొందరికి ఈస్టాంపులు ఇచ్చి మిగతా వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా దరఖాస్తుదారులు వచ్చి తమ రిజిస్ట్రేషన్‌ పని ఎంత వరకు వచ్చిందని అడిగితే కనీస సమాచారం ఇవ్వడంలేదని తెలుస్తోంది. నర్సిరెడ్డి వ్యవహారంపై కొందరు రిజిస్ట్రేషన్‌ శాఖ ఆయా జిల్లాల రిజిస్ట్రార్లు, డీఐజీలకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోతోంది.

కొన్ని సమయాల్లో కృత్రిమ కొరత..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 24 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని సమయాల్లో స్టాంపుల కొరత వస్తూ ఉంటోంది. ఇందుకు కారణం అటు ప్రభుత్వం నాన్‌జ్యుడీషియల్‌ స్టాంపులను సరఫరా చేయకపోవడం..ఇటు ఈస్టాంపింగ్‌ స్టాక్‌ హోల్డర్‌ తన స్వార్థంతో ఈస్టాంపులను సక్రమంగా సరఫరా చేయకపోవడమేనని తెలుస్తోంది. నెలలో ఒక్కో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద ఒక్కోసారి దాదాపు ఐదారు రోజులు స్టాంపుల కొరత ఏర్పడుతుంది. కర్నూలు, కల్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద అయితే వారంలో ఒక్కరోజైనా స్టాంపుల కొరత ఉంటుందని బాధితులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement