
తల్లిదండ్రులకు అపు‘రూప’ బహుమానం
ఆదోని సెంట్రల్: జూనియర్ ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు తెచ్చుకుని ఒక విద్యార్థిని తన తల్లిదండ్రులకు అపురూప బహుమానాన్ని అందించారు. ఆదోని పట్టణానికి చెందిన మల్లనగౌడు, రాజేశ్వరిలు గిఫ్ట్‌షాపు నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా.. మొదటి అమ్మాయి చైతన్య ఇడుపాలయలోని త్రిబుల్ ఐటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు. రెండో అమ్మాయి రూప ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఆదోని పట్టణంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో చదివారు. తల్లిదండ్రుల కష్టాలను చూసిన ఈ విద్యార్థిని చదువులో ప్రతిభను చాటారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో 470కు గాను 466 మార్కులను సాధించారు. ఈ విద్యార్థినిని ఆదోని పట్టణ ప్రజలు, మల్లనగౌడు బంధువులు అభినందించారు.