విజేతలు! | - | Sakshi
Sakshi News home page

విజేతలు!

Nov 27 2026 4:08 AM | Updated on Nov 27 2026 4:08 AM

విజేతలు!

వైఎస్సార్‌ సీపీకి పట్టం కట్టిన పల్లె ప్రజానీకం

సంగ్రామంలో

నాగవరప్పాడు సర్పంచ్‌గా విజయం సాధించిన రాజబోయిన అనిత సంబరాలు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: పంచాయితీ ఎన్నికల తొలిదశ పోరులో వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం సృష్టించింది. తొలిదశ ఎన్నికలు ఎన్టీఆర్‌ జిల్లాలో రెడ్డిగూడెం, జి.కొండూరు, మైలవరం, ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్‌ మండలాల్లో జరిగాయి. మొత్తం 72 పంచాయతీలు, 814 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరిగాయి. కృష్ణాజిల్లాలో గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు, గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ మండల్లాలో మొత్తం 112 పంచాయతీలు, 1304 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం మూడు గంటల నుంచి కౌంటింగ్‌ మొదలుపెట్టారు. ఈ ఫలితాలలో వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థులు అనూహ్యంగా గెలుపు దిశగా దూసుకువచ్చారు. కూటమి ఎన్ని అక్రమాలు దౌర్జన్యాలు చేసినా వారి గెలుపును ఆపలేకపోయారు. జి.కొండూరుతోపాటు పలు గ్రామాల్లో పోలింగ్‌ స్టేషన్ల ఎదుటే యథేచ్ఛగా ఓట్లు కొనుగోలుకు దిగారు. ఓటుకు రెండు వేల రూపాయల వరకూ విచ్చలవిడిగా పంపిణీ చేశారు. అయినా చాలా చోట్ల వైఎస్సార్‌ సీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు మంచి మెజారిటీలతో గెలుపొందారు.

గన్నవరం మండలంలోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలలో వైఎస్సార్‌ సీపీ తన హవా కొనసాగించింది. గోపవరపుగూడెం గ్రామంలో సర్పంచ్‌ అభ్యర్థి నల్లూరి శశికళ, చిన అవుటపల్లి గ్రామంలో సర్పంచ్‌ అభ్యర్థి కోట రాజకుమారి, మెట్ట ప్రాంత గ్రామాల్లో మేజర్‌ పంచాయతీగా ఉన్న ముస్తాబాదలో సర్పంచ్‌ అభ్యర్థి మేడసాని దుర్గారాణి విజయం సాధించారు. తెంపల్లిలో నాగబోయిన గిరీష్‌రాజ్‌ విజయం సాధించారు. కొత్తగూడెంలో వైఎస్సార్‌ సీపీ బలపరిచిన చేకూరు వెంకటేశ్వరమ్మ విజయం సాధించారు. అజ్జంపూడిలో పాలకుర్తి మౌనిక, అల్లాపురంలో చొప్పవరపు లూర్థురాణి, బూతిమిల్లిపాడులో సత్తెనపల్లి మాణిక్యం, కొత్తగూడెంలో చేకూరి వెంకటేశ్వరమ్మ, మాదలవారిగూడెంలో బెజవాడ చంద్రరావు, వీరపనేనిగూడెంలో బొమ్మారెడ్డి రాజ్యలక్ష్మి, కొండపావులూరులో వల్లూరి జోగేశ్వరరావు, పురుషోత్తపట్నంలో చెరుకూరి చిదంబర్‌ గెలుపొందారు. సూరంపల్లి, బుద్ధవరం, కేసరపల్లి, గన్నవరంలలో కౌంటింగ్‌ కొనసాగుతోంది.

బాపులపాడు మండలంలో వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థులు ఆరుగొలనులో డి. శారద, బండారుగూడెం నుంచి బొర్రా గీతాశ్రీ, బొమ్ములూరు నుంచి యర్రంశెట్టి సుమలత, దంతగుంట్ల నుంచి యజ్జవరపు లక్ష్మీ, బాపులపాడు నుంచి దత్తు విజయకుమారి, కానుమోలు నుంచి జక్కం సుధాకర్‌పాల్‌, కొత్తపల్లి నుంచి తెలగనేని రాజేష్‌కుమార్‌, కొయ్యూరు నుంచి సానంకి కమలకుమారి, పెరికీడు నుంచి పత్తిపాటి రోజాపుష్పా, రంగన్నగూడెం నుంచి తలారి తంబిబాబు, ఎ సీతారామపురం నుంచి కొండేటి అనంతలక్ష్మి, కె. సీతారామపురం నుంచి బొకినాల బాబు, తిప్పనగుంట నుంచి మూల్పూరి సువర్ణలక్ష్మీ, వేలేరు నుంచి బాల మళావతుల గెలుపొందారు.

ఉంగుటూరు మండలంలో వైఎస్సార్‌ సీపీ బలపరచిన అభ్యర్థులుగా ఆత్కూరు నుంచి పొట్లూరి గోపీకృష్ణ, ఎలుకపాడు నుంచి ఉన్నంగి మరయమ్మ, గారపాడు నుంచి పుట్టి పద్మ, లంకపల్లి నుంచి గోగులమూడి ఉదయకుమార్‌, మానికొండ నుంచి చెరుకువాడ సుధీర్‌కుమార్‌, నాగవరప్పాడు నుంచి రాజబోయిన అనిత, తరిగొప్పల నుంచి కోటగిరి రామ్మోహనరావు, ఉంగుటూరు నుంచి పంట లలిత, వేమండ నుంచి దండేపూడి తేజ గెలుపొందారు.

గుడివాడ మండలం శేరీగొల్వేపల్లి, తటివర్రు, గుంటాకోడూరు గ్రామాల వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు సర్పంచ్‌లుగా చేబ్రోలు సురేష్‌, కాకొల్లు రాజారెడ్డి, గోరుముచ్చు జయరాజు టీడీపీ బలపరిచిన అభ్యర్థులపై విజయం సాధించారు.

గుడ్లవల్లేరులోని శేరిదగ్గుమిల్లిలో జన్ను చిరంజీవి, మామిడికోళ్లలో మట్టా కమల, వెనుతురుమిల్లిలో చందన నాగం నాయుడు, వేమవరం గ్రామంలో మన్నెం లక్ష్మణరావు, పెంజండ్రా గ్రామంలో జక్కుల అనీల, ఉలవలపూడి నుంచి యార్లగడ్డ పావని వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థులుగా గెలుపొందారు.

నందివాడ మండలంలోని ఇలపర్రు నుంచి చింతాడ వెంకట రంగమ్మ, తుమ్మలపల్లి నుంచి పరిమి సుధారాణి, జనార్దనపురం నుంచి కొండపల్లి ఉమా శంకర్‌ రెడ్డి, అరిపిరాల నుంచి గోవాడ సుస్మిత, పెదలింగాల నుంచి చింత కృష్ణ బాబు, చినలింగాల నుంచి చిన్నంరావ్‌, అనమనపూడి నుంచి వెంకట కృష్ణారెడ్డి, వెన్ననపూడి నుంచి లింగం మాధవి వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థులుగా గెలుపొందారు.

మైలవరం మండలంలో వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థులు కనిమెర్లతండా నుంచి అజ్మీరా దుర్గాభవానీ, సీతారంపురంతండా నుంచి సోన్యా నాయక్‌, కీర్తిరాయినిగూడెం నుంచి బొర్రా కోమల, వెల్వడం నుంచి వేల్పూరి తిరుమల, మెర్సుమల్లి నుంచి సగ్గుర్తి వెంకటరత్నం, పొందుగుల నుంచి పుల్లూరు శ్రీను, గణపవరం నుంచి బొల్లారెడ్డి మానస గెలుపొందారు.

జి.కొండూరులో వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థులు కట్టుబడిపాలెంలో బాణోతు నవీన, పినపాకలో జంగం విజయ్‌, దుగ్గిరాలపాడులో జడ రాంబాబు, కుంటముక్కలలో పామర్తి అలివేలుమంగమ్మ, కోడూ రులో వంగా నాగశిల్ప, కందులపాడులో మందా రమే ష్‌, వెంకటాపురం యరమల ఇందిర గెలుపొందారు.

ఇబ్రహీంపట్నం మండలంలో కాచవరం గ్రామ పంచాయతీ నుంచి వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థి దండబోయిన రాజేంద్రప్రసాద్‌ గెలుపొందారు.

రెడ్డిగూడెం మండలంలో వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థులు నరుకుళ్లపాడు నుంచి మాదు రాజేశ్వరి, అన్నేరావుపేట నుంచి వనపర్ల స్మైలీ, రుద్రవరం నుంచి బయ్యర్ల ఏసుపాదం గెలుపొందారు.

విజయవాడరూరల్‌ మండలంలో కొత్తూరుతాడేపల్లి నుంచి లఖంరాజు సరోజిని గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement