ముగిసిన | - | Sakshi
Sakshi News home page

ముగిసిన

Nov 27 2026 4:08 AM | Updated on Nov 27 2026 4:08 AM

ముగిసిన తొలి విడత పోరు

గుడివాడ డివిజన్‌లో ఆరు మండలాల్లో 79.77శాతం పోలింగ్‌
తొలి విడత పోరు

చిలకలపూడి(మచిలీపట్నం): స్థానిక సంస్థలకు సంబంధించి పంచాయతీ మొదటిదశ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. గుడివాడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఆరు మండలాల్లోని పంచాయతీలకు సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 136 పంచాయతీల్లోని సర్పంచ్‌, 1304 వార్డు సభ్యులకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు. సర్పంచ్‌ స్థానాలు 15 ఏకగ్రీవం కాగా 121 స్థానాలకు మాత్రం ఎన్నికలు జరిగాయి. 362 వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా 942 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.

79.77 శాతం పోలింగ్‌ నమోదు..

● గుడివాడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో పంచాయతీల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు ఆయా బూత్‌లలో ఎన్నికలు నిర్వహించారు.

● మొత్తం 2,63,603 మంది ఓటర్లు ఉండగా 2,10,270 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు.

● డివిజన్‌ పరిధిలోని గన్నవరం మండలంలో 58,511 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 78.73 శాతం పోలింగ్‌ నమోదైంది.

● బాపులపాడు మండలంలో 55,770 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 77.11 పోలింగ్‌ శాతం నమోదైంది.

● గుడివాడ మండలంలో 11,801 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 86.27 శాతం నమోదైంది.

● గుడ్లవల్లేరులో 25,019 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 81.07 శాతం నమోదైంది.

● నందివాడలో 23,580మంది ఓటు హక్కు వినియోగించుకోగా 80.84 శాతం నమోదైంది.

● ఉంగుటూరు మండలంలో 35,589 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 82.9 శాతం నమోదైంది.

పోలింగ్‌ సరళి పరిశీలన..

పోలింగ్‌ కేంద్రాల ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణ, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, పోలింగ్‌ ప్రక్రియ సజావుగా సాగుతున్న తీరుతో పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. డీఆర్వో కె. శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement