చిలకలపూడి(మచిలీపట్నం): భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి విలువలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అధికారులు, కలెక్టరేట్ సిబ్బందితో భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివించి ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ విలువలు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వాటి పరిరక్షణకు కట్టుబడి ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కె. శ్రీధర్‌రెడ్డి, కలెక్టరేట్ ఏవో ఏఎస్‌ఎన్ రాధిక, సూపరింటెండెంట్ నెల్సన్‌పాల్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ


