వలంటీర్లకు చంద్రబాబు నమ్మక ద్రోహం చేశారు. ఎన్నికల సమయంలో నెలకు రూ.10వేల జీతం ఇస్తానని నమ్మ బలికి.. ఎన్నికల తర్వాత ఉద్యోగాలే లేకుండా చేసి రోడ్డున పడేశారు. ఇప్పుడేమో తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఇన్‌ఫ్లుయెన్సర్‌ల పేరిట దోచి పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా? గతంలో ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని అందించడానికి శక్తివంచన లేకుండా కృషి చేశాం.
– నూదులగంటి కోటి ప్రసాద్,
మాజీ వలంటీర్, పామర్రు


