కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Oct 5 2026 12:57 AM | Updated on Oct 5 2026 12:57 AM

సోమవారం శ్రీ 5 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 ఫెయిల్డ్‌ మోడల్‌ను బలవంతంగా రుద్దుతున్న సర్కారు నేడు కలెక్టరేట్లో పీజీఆర్‌ఎస్‌ కేంద్ర మంత్రికి స్వాగతం అభయాంజనేయుని సేవలో.. నేడు ఆర్చర్‌ జ్యోతి సురేఖ రాక

న్యూస్‌రీల్‌

మునిసిపాలిటీలపై భారీ భారం..

‘స్థానిక’ ఎన్నికల వేళ అభివృద్ధి పేరిట స్టంట్‌

మూడేళ్ల పాటు నిషేధం విధించిన సంస్థకు పనుల బాధ్యత మునిసిపాలిటీలు 40 శాతం, కాంట్రాక్టర్లు 60 శాతం నిధులు పెడతారట ఆపై 60 శాతం అప్పు వడ్డీతో కట్టే బాధ్యత పురపాలికలదే మునిసిపాలిటీలను మరింత అప్పుల ఊబిలోకి నెట్టే యత్నం

సోమవారం శ్రీ 5 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
ఫెయిల్డ్‌ మోడల్‌ను బలవంతంగా రుద్దుతున్న సర్కారు
నెల రోజులుగా నరకం

7

చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. 1100 నంబరుకు కాల్‌ చేస్తే అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు.

గన్నవరం: కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌కు ఆదివారం విమానాశ్రయంలో కృష్ణా జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు.

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌లోని ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త జస్టిస్‌ టి.మల్లికార్జునరావు కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు పాలకమండలి సభ్యులు, దేవదాయ శాఖ అధికారులు, అర్చకులు వేద మంత్రోచ్చరణ మధ్య పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. హనుమంతునికి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలు, చిత్రపటం, ప్రసాదాలను అందించారు. ఆలయ పాలకమండలి చైర్మన్‌ వేమూరి శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి పితాని తారకేశ్వరరావు పాల్గొన్నారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ సోమవారం ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లికి చేరుకోనున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఉదయం చేరుకుని అక్కడ నుంచి తాడేపల్లిలోని ఆమె నివాసానికి వెళతారు. జ్యోతి సురేఖకు స్వాగతం పలికేందుకు నగరంలోని క్రీడాకారులు, శాప్‌ సిబ్బంది గన్నవరం విమానాశ్రయానికి వెళ్లనున్నారు. జపాన్‌లో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో మహిళల కాంపౌండ్‌ ఆర్చరీ టీమ్‌ విభాగంలో జ్యోతి సురేఖ స్వర్ణ పతకాన్ని సాధించారు. ఆసియా క్రీడల చరిత్రలో వరుసగా నాలుగు సార్లు మన దేశానికి ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించిన ప్రముఖ క్రీడాకారిణుల్లో జ్యోతి సురేఖ ఉన్నారు.

సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబు.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఫెయిల్యూర్‌ అయిన మోడల్‌ను తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలపై రుద్దుతున్నారు. ఇటీవలే చిత్తూరు జిల్లా కుప్పంలో హ్యామ్‌(హైబ్రిడ్‌ యాన్యూ టీ మోడల్‌) పేరిట ఆర్భాటంగా వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. ఈ స్టంట్‌ వెనుక నిధుల దోపిడీకి పెద్ద స్కెచ్‌ వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిర్వీర్యం చేశారు..

అధికారం చేపట్టినప్పటి నుంచి స్థానిక సంస్థల పట్ల చంద్రబాబు నిర్లక్ష్యం, వివక్ష చూపుతూ వస్తున్నారనే విషయం జగమెరిగిన సత్యం. వైఎస్సార్‌ సీపీకి చెందిన వారే అత్యధికంగా కార్పొరేషన్ల మేయర్లు, మునిసిపాలిటీల్లో చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలుగా ఉండడంతో వాటికి నిధులు ఆపేసి నిర్వీర్యం చేశారు. ఇటీవలే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వీఎంసీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, జెడ్పీ చైర్మన్‌ ఉప్పాల హారిక, మున్సిపల్‌ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యుల ఐదేళ్ల పదవీ కాలం ముగిసింది. ఎంపీపీలకు, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ముగిసి సెప్టెంబర్‌ 23వ తేదీ ముగిసినా 33 నెలల గౌరవ వేతనం ఇవ్వలేదు. పంచాయతీ రాజ్‌ శాఖలో నిధులు ఉన్నా కూడా ఇవ్వకుండా అవమానకర రీతిలో చంద్రబాబు ప్రభుత్వం సాగనంపింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మొత్తం 49 జెడ్పీటీసీ సభ్యులంతా కలిసి పట్టుబడితే జనరల్‌ ఫండ్స్‌ నుంచి 30 నెలల వేతనాలు ఇచ్చారు.

ఆది నుంచీ నిర్లక్ష్యమే..

విజయవాడలో సరిగా డ్రెయిన్లు నిర్వహించలేని దుస్థితిలో ఉంది ప్రభుత్వం. దీనికితోడు మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ విజయవాడ, మచిలీ పట్నం కార్పొరేషన్లలో మౌలిక సదుపాయాల గురించి చర్చించిన దాఖలాలు లేవు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, తాడిగడప, పెడన, ఉయ్యూరు, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు మునిసిపాలిటీల్లో కనీసం డ్రెయిన్లు శుభ్రం చేయలేని దుస్థితి. అన్ని మునిసిపాలిటీల్లో కూడా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బకాయిలు పెండింగ్‌లో పెట్టింది. ఇప్పుడు ఎన్నికలు వస్తుండడంతో నగరాలు, పట్టణాల సుందరీకరణ అని ఆర్భాటపు ప్రచారం ప్రారంభించింది.

ప్రాజెక్టు ఏదైనా దోపిడీ పక్కా!

2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాజెక్టు ఏదైనా దోపిడీయే తమ పాలసీ అన్నట్లు చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు ప్రకృతి వనరులను కొల్లగొడుతూనే, మరోవైపు రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు వచ్చినా లోకేశ్‌ కనుసన్నల్లో పర్సంటేజీల రూపంలో ఆర్థిక దోపిడీ జరుగుతూనే ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాల చుట్టూ నిర్మిస్తున్న యాక్సెస్‌ కంట్రోల్డ్‌ అమరావతి ఔటర్‌రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) నిర్మాణ ప్రాజెక్టును సైతం చంద్రబాబు ప్రభుత్వం ఈ హ్యామ్‌ విధానంలోనే కట్టబెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

హ్యామ్‌ విధానం ప్రకారం ప్రాజెక్ట్‌ వ్యయంలో 40 శాతం మునిసిపాలిటీలు నిధులు సమకూరిస్తే.. మిగిలిన 60 శాతం ప్రైవేట్‌ డెవలపర్లు పెడతారు. వారు పెట్టే 60 శాతం పెట్టుబడిని, వచ్చే 10 ఏళ్ల పాటు మునిసిపాలిటీలు తమ సొంత ఖజానా నుంచి వడ్డీతో సహా ‘యాన్యుటీ’(వార్షిక వాయిదాల) రూపంలో సదరు కంపెనీలకు చెల్లించాలి. ప్రజలు కట్టే ఆస్తి, నీటి పన్నులు, మునిసిపల్‌ ఫీజులన్నీ కార్పొరేట్‌ కంపెనీల ఖాతాల్లోకి జమ కానున్నాయి. దీనివల్ల విజయవాడ, మచిలీపట్నం లాంటి మహా నగరాల్లో భవిష్యత్తులో చిన్న డ్రెయినేజీ పూడిక తీయాలన్నా.. చెత్త సేకరణకు కూడా నిధులు లేక పూర్తిగా దివాలా తీసే ప్రమాదం పొంచి ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పనులను కూడా చంద్రబాబు తనకు అనుకూలమైన పెద్ద కార్పొరేట్‌ కంపెనీలకు, పచ్చ తమ్ముళ్లకు కట్టబెట్టడానికే ఈ సంక్లిష్టమైన ‘హ్యామ్‌’ విధానాన్ని తెరపైకి తెచ్చారని చిన్న కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ నగరానికి వివిధ పనుల ద్వారా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.400 కోట్లు పెండింగ్‌లో ఉండగా ఇటీవలే కాంట్రాక్టర్లు సమ్మెచేస్తే వారికి రూ.30 కోట్లు మాత్రమే చెల్లించారు. వీఎంసీకి వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీడీఎంఏ, పురమిత్ర ద్వారా తరలించుకుపోతోంది. ఈ నేపథ్యంలో నగరానికి నిధులు ఇవ్వాల్సిన ప్రభుత్వం సాధారణ నిధులు కూడా మళ్లించటం, ఇప్పుడు ప్రైవేటు పరం చేయటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement