చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి

Oct 4 2026 10:55 AM | Updated on Oct 4 2026 10:55 AM

పటమట(విజయవాడతూర్పు): గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన పటమట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ గుర్తుతెలియని వ్యక్తి (45) పటమట సెంటర్‌లోని లల్లీబార్‌ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా సిబ్బంది చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వ్యక్తి చనిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుని వివరాలు తెలిసిన వారు పటమట పోలీస్‌స్టేషన్‌ 0866–2542333, 94401 78369 నంబర్లో సంప్రదించాలని సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement