60 ఏళ్ల వృద్ధుడికి క్లిష్టమైన గుండె సర్జరీ | - | Sakshi
Sakshi News home page

60 ఏళ్ల వృద్ధుడికి క్లిష్టమైన గుండె సర్జరీ

Oct 4 2026 10:55 AM | Updated on Oct 4 2026 10:55 AM

లబ్బీపేట(విజయవాడతూర్పు): గుండె బృహత్‌ ధమని కవాటంతో పాటు, ఆ కవాటం రూట్‌, ఆరోహణ దెబ్బతిన్న రోగికి అత్యంత క్లిష్టమైన, అరుదైన శస్త్ర చికిత్సను విజయవాడ సెంటినీ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. కవాటంతో పాటు, రూట్‌, ఆరోహణ దెబ్బతిన్నప్పుడు వాటిని తొలగించి, కృత్రిమ గ్రాఫ్ట్‌తో మార్చే ఒక క్లిష్టమైన గుండె శస్త్ర చికిత్సలకు బెంటాల్‌ సర్జరీ అంటారని ఆస్పత్రి కార్డియో థోరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ కత్తి రవికుమార్‌, డాక్టర్‌ కోసూరు శ్రీనివాసబాబు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆస్పత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు వివరాల వెల్లడించారు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం సీతారామపురానికి చెందిన 60 ఏళ్ల సత్యనారాయణ అత్యవసర పరిస్థితిలో తమ ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు. అతనికి యాంజియోగ్రామ్‌ చేయగా, బృహత్‌ ధమని కవాటంతో పాటు, రూట్‌, ఆరోహణ కూడా దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. కవాటం మార్పిడితో పాటు, రూట్‌, ఆరోహణ కూడా కృత్రిమంగా వేయాల్సి ఉండటంతో సర్జరీ అత్యంత క్లిష్టతరంగా మారిందన్నారు. ఈ కేసును సవాలుగా తీసుకుని బెంటాల్‌ ప్రొసీజర్‌లో విజయవంతంగా సర్జరీ నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. ఈ సర్జరీ నిర్వహణలో ఎనస్థీషియన్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌, కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ కాగిత కృష్ణచంద్‌లు తనవంతు పాత్ర నిర్వహించినట్లు తెలిపారు. క్లిష్టతరమైన సర్జరీని విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందాన్ని ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ మొవ్వ పద్మ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆనంద్‌శ్రీనివాస్‌లు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement