ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వేడుకలు నిర్వహించారు. పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. కార్యక్రమంలో పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, మొండితోక అరుణకుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, ఇతర నాయకులు పాల్గొని, కొత్త సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు.
– లబ్బీపేట(విజయవాడతూర్పు)


