కృష్ణాజిల్లా
న్యూస్‌రీల్
ప్రభుత్వ ఏడబ్ల్యూడీ భూములపై బడాబాబులు కన్ను యథేచ్ఛగా అక్రమంగా రొయ్యల చెరువుల తవ్వకాలు సమీప పొలాలు చౌడుబారతాయని రైతులు ఆందోళన
పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ అధికారులు
ఆయకట్టు చౌడుబారే ప్రమాదం
బుధవారం శ్రీ 4 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 36.4577 టీఎంసీలు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి హైదరాబాద్‌కు చెందిన చల్లా చంద్రమౌళి, సరోజిని దంపతులు మంగళవారం రూ.లక్ష విరాళం సమర్పించారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య విద్యలో ఏఐ ఆధారిత కాంపిటెన్సీ బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రంలోని 38 మెడికల్ కళాశాలల ప్రిన్సిపాల్స్, వైఎస్ ప్రిన్సిపాల్స్, ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులకు మంగళవారం వెబ్‌ఎక్స్ నిర్వహించారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెరికాలో వైద్య ఆరోగ్య రంగంలో 25 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ చంద్రశేఖర్ బందుగల ఎడ్మెడ్ ఏఐ సహకారంతో రూపొందించిన ఏఐ ఆధారిత అభ్యాస మౌళిక సదుపాయాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వీసీ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. డాక్టర్‌చంద్ర శేఖర్ బొందుగుల మాట్లాడుతూ.. అమెరికాలో స్థిరపడినప్పుటికీ మన దేశంలోని వైద్య విద్యార్థుల కోసం ఏదైనా చేయాలని అత్యుత్తమ నాణ్యత కలిగిన ఏఐ ఆధారిత వైద్య విద్య పక్రియలను అందించేందుకు యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. దీని ద్వారా ప్రతిభావంతులైన వైద్యులను అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సాయిసుధీర్, రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీసూర్యప్రభ, పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ సుధ తదితరులు పాల్గొన్నారు.
సాక్షి టాస్‌ఫోర్స్: సముద్రతీర ప్రాంతంలోని ప్రభుత్వానికి సంబంధించిన ఏడబ్ల్యూడీ భూములపై బడాబాబులు కన్నేశారు. అధికార పార్టీ నేతల అండదండలతో యథేచ్ఛగా రొయ్యల చెరువుల తవ్వకాలు చేపట్టారు. రొయ్యల చెరువుల సాగు వల్ల సమీపంలోని తమ పంట పొలాలు చౌడుబారతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పెద్ద ఎత్తున సాగుతున్న తవ్వకాలు
కోడూరు మండలంలోని హంసలదీవి గ్రామ సమీపంలో దింటిమెరక రహదారిని అనుకొని ప్రభుత్వానికి సంబంధించిన ఏడబ్ల్యూడీ భూమి ఉంది. సాగునీరు సమస్య కారణంగా ఈ ప్రాంతాన్ని బీడుగా వదిలేశారు. దీనిని అదునుగా చేసుకున్న కొంతమంది బడాబాబులు రెవెన్యూ అధికారులతో సంబంధం లేకుండానే ఈ భూముల్లో అక్రమంగా రొయ్యల చెరువుల తవ్వకాలు ప్రారంభించారు. ఇప్పటికే 25 ఎకరాల ఏడబ్ల్యూడీ భూమిని కబ్జా చేసినట్లు సమాచారం. పగలూ రాత్రి అన్న తేడా లేకుండా చెరువు తవ్వకాల పనులు నిరాటంకంగా సాగుతున్నాయి. భారీ యంత్రాలతో పది అడుగుల ఎత్తున చెరువుల గట్లను నిర్మిస్తున్నారు. దింటిమెరక – హంసలదీవి రహదారి మార్జిన్‌ను కూడా ఆక్రమించి గట్లను ఏర్పాటు చేస్తున్నారు. చెరువులకు సంబంధించిన పరికరాలు భద్రపర్చుకోవడం, కూలీలు ఉండేందుకు అవసరమైన నిర్మాణాలను కూడా రహదారి మార్జిన్ వెంట చేపట్టారు. చెరువుల్లోని వ్యర్థాలను వదిలేందుకు పక్కనే ఉన్న పంటకాలువను వినియోగించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
లేని చెరువులు ఉన్నట్లు అనుమతి
ప్రస్తుతం బడాబాబులు తవ్వకాలు చేపట్టిన చెరువులు నిన్నటి వరకు బీడు భూములు గానే ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆక్వా జోన్ పరిధిలోనే ఉప్పునీటి రొయ్యలు, చేపల చెరువుల తవ్వడానికి అనుమతి ఉంది. ఆక్వా జోన్ పరిధి కాకుండా కొత్త చెరువుల తవ్వినా, ఉన్న చెరువులకు మరమ్మతులు చేసినా అధికారులు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. అయితే మత్స్యశాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఈ చెరువుల తవ్వకాలకు అనుమతులు ఇచ్చినట్లు సమీప రైతులు ఆరోపిస్తున్నారు. అసలు చెరువులు లేకుండానే ఈ భూముల్లో చెరువులు ఉన్నట్లు మత్స్యశాఖ అధికారులు 11 నెలలకు సీఓసీ (సాగు సర్టిఫికెట్) ఇచ్చినట్లు సమాచారం. లేని చెరువులు ఉన్నట్లు చూపి, కొత్త చెరువులు తవ్వడానికి బడాబాబులకు పూర్తిస్థాయిలో మత్స్యశాఖ అధికారులు సహకరిస్తున్నట్లు రైతులు మండిపడుతున్నారు. ప్రస్తుతం తవ్వుతున్న చెరువులు కొత్తవి కాదని, గతంలో ఉన్న చెరువులకు మరమ్మతులు చేస్తున్నారని మత్స్య శాఖ అధికారులు ప్రకటనలు ఇవ్వడం చర్చనీయంశమైంది. ఈ చెరువుల తవ్వకాలు జరిపేందుకు సంబంధించి అధికారులకు బడాబాబులు భారీ మొత్తంలో ముడుపులు చెల్లించినట్లు ఆయకట్టు రైతులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
డాక్టర్ బొందగల చంద్రశేఖర్‌ను సన్మానిస్తున్న వీసీ డాక్టర్ చంద్రశేఖర్
7
ప్రభుత్వానికి సంబంధించిన ఏడబ్ల్యూడీ భూముల్లో చెరువుల తవ్వకాలు చేస్తున్నా రెవెన్యూ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడలేదు. చెరువులు తవ్వకాలు పూర్తిగా మత్స్యశాఖ పరిధిలోకి వస్తాయని, వీటితో తమకు సంబంధం లేదని స్పష్టంచేస్తున్నారు. చెరువు గట్లను నిబంధనలకు విరుద్ధంగా పది అడుగులు ఎత్తున ఏర్పాటు చేస్తున్నా మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. రైతులు పంట పొలాల్లో మెరకలు తీసుకొనేందుకు సవాలక్షా ఆంక్షలు పెట్టే మైనింగ్ అధికారులు, ఇంత భారీ మొత్తంలో చెరువులు తవ్వుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం తవ్వకాలు చేపడుతున్న చెరువుల పక్కనే వేలాది ఎకరాల మాగాణి భూమి ఉంది. ఈ భూమిలో రైతులు వరి సాగు చేస్తున్నారు. ఉప్పునీటి చెరువుల కారణంగా ఆయకట్టు మొత్తం బీడుబారే ప్రమాదం ఉందని రైతులు ఆందో ళన చెందుతున్నారు. ఇప్పటికే సముద్రతీర ప్రాంతం వెంట తాగునీరు దొరకని పరిస్థితి నెలకొందని, పొలాల పక్కన కూడా ఉప్పునీటి చెరువులు తవ్వితే భవిష్యత్‌లో సాగు భూమి లేకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు. తీరప్రాంతాన్ని రక్షించాల్సిన అధికారులు, పాలకులు బడాబాబులకు కొమ్ముకాస్తూ నిబంధనలకు విరుద్ధంగా చెరవుల తవ్వకాలకు అనుమతి ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహరంపై కలెక్టర్ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని తీరప్రాంత ప్రజలు, రైతులు కోరుతున్నారు. ఈ విషయమై మత్స్యశాఖ ఏడీ ప్రతిభను వివరణ కోరగా, హంసలదీవి సమీపంలో తవ్వేవి కొత్త చెరువులు కాదని, గతంలో ఉన్న వాటికి మరమ్మతులు చేసుకుంటున్నారని చెప్పడం గమనార్హం.
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా


