రీ సర్వే పనుల పరిశీలన
మోపిదేవి: మండలంలోని పెదప్రోలు రెవెన్యూ పరిధిలో నిర్వహిస్తున్న రీ సర్వే పనులను కృష్ణా జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి పి.లక్ష్మణరావు మంగళవారం పరిశీలించారు. రికార్డుల ఆధారంగా రీ సర్వే సక్రమంగా జరగాలని, రైతుల నుంచి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందుగా సమా చారం అందించాలని సూచించారు. తహసీ ల్దార్ ఎం.హరనాథ్, రీ సర్వే డీటీ ఎం.ప్రసాద్, మండల సర్వేయర్ డి.సుధీర్, వీఆర్వో నాగమల్లేశ్వరావు, గ్రామ సర్వేయర్ లోకేష్, పలువురు రైతులు పాల్గొన్నారు.
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మంగళవారం కార్నియల్ డొనేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.యుగంధర్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.టి.కె.రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.ఆశాలత ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న నేత్రదాన కార్యక్రమాలకు మద్దతుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ జి.భానుమూర్తి మాట్లాడుతూ.. భవిష్యత్తులో కార్నియల్ మార్పిడి శస్త్రచికిత్సలకు అవసరమైన ఆధునిక పరికరాలను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. నేత్రదానం ప్రాముఖ్యతను డాక్టర్ నిరంజన్, డాక్టర్ శేషు కుమార్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ లీలా ప్రసాద్ వివరించారు. అగర్వాల్ ఐ హాస్పిటల్ మేనేజర్ రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణా విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల మహిళా చెస్ పోటీల్లో తమ కళాశాల విద్యార్థినులు చక్కని ప్రతిభ కనబరిచి చాంపియన్లుగా నిలిచారని కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కృష్ణవేణి తెలిపారు. ఇటీవల గుడివాడ ఏఎన్‌ఆర్ కాలే జీలో జరిగిన పోటీల్లో తమ విద్యార్థినులు జె.సాయిహర్షిత, జి.రాజరాజేశ్వరి, కె.పూర్విత అంజన రామచంద్ర, కె.హేమ విజేతలుగా నిలిచారని పేర్కొన్నారు. కళాశాలలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సెక్రెటరీ అండ్ కర స్పాండెంట్ టి.శ్రీనివాసు, హిందూ హైస్కూల్స్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి.నారాయణరావు, వ్యాయామ విభాగాధిపతి డి. హేమచంద్రరావు, చెస్ కోచ్ పి.జ్యోతి కిరణ్ విద్యార్థులను అభినందించారు.
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): డ్రగ్స్‌పై దండయాత్ర నినాదంతో పోలీసులు చేపట్టిన 510 కిలోమీటర్ల సైకిల్ యాత్ర మంగళవారం విజయవాడలో కొనసాగింది. ఏడీసీపీ జి.రామకృష్ణ, పర్యవేక్షణలో నార్త్ ఏసీపీ స్రవంతిరాయ్, సత్యనారాయణపురం ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్డు, శారద కళాశాల జంక్షన్‌లో సెకిల్ ర్యాలీ జరిగింది. డ్రగ్స్ వద్దు యోగా ముద్దు నినాదంతో బ్రహ్మకుమారిస్ నుంచి బి.కె.పద్మజ, బి.కె.రాధిక ఆధ్వర్యంలో 400 మందితో ప్రాణాయామం, యోగా ట్రైనర్ నివారిక ఆధ్వర్యంలో యోగ సాధన నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్‌బాబు, ఈగల్ ఐజీ రవికృష్ణ, అడ్మిన్ డీసీపీ కె.వి.వి సరిత, డాక్టర్ సమరం తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం, రెడ్‌క్రాస్ సొసైటీ, పలు స్వచ్ఛంద సంస్థలు, ఆటో యూనియన్ల ప్రతినిధులు, ట్రాన్స్ జెండర్లు, మూడు వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
రీ సర్వే పనుల పరిశీలన


