టీడీపీ కార్యకర్తల్లా ఖాకీలు!
మైలవరంలో ఆర్టీసీ బస్సులపై టీడీపీ నేతల డ్యాన్సులు, బైకులతో విన్యాసాలు గందరగోళం సృష్టించిన టీడీపీ శ్రేణులపై కేసులు నమోదు చేయని పోలీసులు శాంతియుతంగా ర్యాలీ చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు అధికార పార్టీ నేతల్లా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ఖాకీలు
మైలవరం(జి.కొండూరు): టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. చంద్రబాబు పాలనలో ఖాకీలు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. శాంతిభద్రతలు పూర్తిగా గాలికొదిలేసి పోలీసులు వ్యవహరిస్తున్న విభిన్న శైలి ప్రజలను, రాజకీయ నేతలను విస్మయానికి గురి చేస్తోంది. అధికార టీడీపీ నాయకులు ఎన్ని అకృత్యాలకు పాల్పడినా కేసులు నమోదు చేయడానికి మనసొప్పని పోలీసులు.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వరుసగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాకీలు తీరు ఇలా ఉండగా, ఎన్టీఆర్ జిల్లా మైలవరం పోలీసులు అందుకు రెండింతలుగా ఉండటం గమనార్హం.
టీడీపీ నేతలపై కేసులు పెట్టరు..
గత నెల 4న మైలవరానికి చెందిన యువ టీడీపీ నాయకుడు లంకా లితీష్ పుట్టినరోజు సందర్భంగా ఆ రాత్రి మైలవరం గ్రామ పంచాయతీ సెంటర్లో టీడీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. నాలుగు గంటలపాటు గ్రామంలో డీజేలతో, బైకులతో విన్యాసాలు చేస్తూ స్థానికులను భయాందోళనకు గురి చేశారు. ట్రాఫిక్‌లో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులపైకి ఎక్కి డ్యాన్సులు వేశారు. వాహనదారులు నరకయాతన పడినప్పటికీ పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదు.
వైఎస్సార్‌సీపీ నేతలపై వరుస కేసులు..
ప్రశ్నిస్తే కేసులే..
కూటమి ప్రభుత్వ తీరు, మైలవరం నియోజకవర్గంలో కుంటుపడిన అభివృద్ధి, యథేచ్ఛగా జరుగుతున్న మట్టి మాఫియా వ్యవహారాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఇబ్రహీంపట్నంకు చెందిన సీనియర్ జర్నలిస్టు వెలమా రామారావుని మైలవరం పోలీసులు జూలై 8న అదుపులోకి తీసుకొని విచారణ అనంతరం జి.కొండూరు స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు.
టీడీపీ కార్యకర్తల్లా ఖాకీలు!


