ప్రత్యేక రైళ్లు ఫిబ్రవరి వరకు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక రైళ్లు ఫిబ్రవరి వరకు పొడిగింపు

Dec 27 2025 6:51 AM | Updated on Dec 27 2025 6:51 AM

ప్రత్యేక రైళ్లు ఫిబ్రవరి వరకు  పొడిగింపు

ప్రత్యేక రైళ్లు ఫిబ్రవరి వరకు పొడిగింపు

ప్రత్యేక రైళ్లు ఫిబ్రవరి వరకు పొడిగింపు మంత్రి పేరు చెప్పి రూ.1.15 కోట్లు మోసం 265 మొబైల్‌ ఫోన్లు అప్పగింత

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను ఫిబ్రవరి వరకు పొడిగించినట్లు విజయవాడ డివిజన్‌ రైల్వే పీఆర్‌ఓ నుస్రత్‌ మండ్రుప్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం–తిరుపతి (08583) జనవరి 1 నుంచి ఫిబ్రవరి 23 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–విశాఖపట్నం (08534) జనవరి 6 నుంచి ఫిబ్రవరి 24 వరకు ప్రతి మంగళవారం, విశాఖపట్నం–తిరుపతి (08547) జనవరి 7 నుంచి ఫిబ్రవరి 25 వరకు ప్రతి బుధవారం, తిరుపతి–విశాఖపట్నం (08548) జనవరి 8 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రతి గురువారం, విశాఖపట్నం–చర్లపల్లి (08579) జనవరి 2 నుంచి ఫిబ్రవరి 27 వరకు ప్రతి శుక్రవారం, చర్లపల్లి–విశాఖపట్నం (08580) జనవరి 3 నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రతి శనివారం నడపనున్నారు.

రద్దీ దృష్ట్యా..

విజయవాడ మీదుగా నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. భువనేశ్వర్‌– యశ్వంత్‌పూర్‌ (0811) జనవరి 3 నుంచి ఫిబ్రవరి 21 వరకు ప్రతి శనివారం, యశ్వంత్‌పూర్‌– భువనేశ్వర్‌ (02812) జనవరి 5 నుంచి ఫిబ్రవరి 23 వరకు ప్రతి సోమవారం, విశాఖపట్నం–ఎస్‌ఎంవీటీ బెంగళూరు (08581) జనవరి 4 నుంచి 25 వరకు ప్రతి ఆదివారం, ఎస్‌ఎంవీటీ బెంగళూరు –విశాఖపట్నం (08582) జనవరి 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, సంబల్‌పూర్‌– ఈరోడ్‌ (08311) జనవరి 7 నుంచి 28 వరకు ప్రతి బుధవారం, ఈరోడ్‌ – సంబల్‌పూర్‌ (08312) జనవరి 9 నుంచి 30 వరకు ప్రతి శుక్రవారం, సంత్రగచ్చి– యలహంక (02863) జనవరి 1 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రతి గురువారం, యలహంక– సంత్రగచ్చి (02864) జనవరి 3 నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రతి శనివారం, షాలీమార్‌– చైన్నె సెంట్రల్‌ (02841) జనవరి 5 నుంచి 26 వరకు, చైన్నె సెంట్రల్‌– షాలీమార్‌ (02842) జనవరి 7 నుంచి 28 వరకు ప్రతి బుధవారం నడపనున్నారు.

లక్ష్మీపురం(గుంటూరు): రాష్ట్ర ఎకై ్సజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తరఫున ఏజెంట్లు అని చెప్పి వైన్‌ షాప్‌, లిక్కర్‌ మార్ట్‌ మంజూరు చేయిస్తామని రూ.1.15 కోట్లు వసూలు చేసి మోసం చేసిన ఘటనపై గుంటూరు అరండల్‌పేట పోలీసులు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. గుంటూరు ఎస్‌వీఎన్‌ కాలనీకి చెందిన నల్లూరి వెంకటేశ్వర్లుకు అన్నపూర్ణ నగర్‌ చెందిన వంకాయలపాటి రాంబాబు అనే వ్యక్తి సుమారు 12 సంవత్సరాలుగా పరిచయం ఉంది. రాంబాబు, శ్రీకంద సాయి కిరణ్‌ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. ఇద్దరు కలిసి రాష్ట్ర ఎకై ్సజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తరఫున ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు నమ్మించారు. బాధితుడు వెంకటేశ్వర్లుకు వైన్‌ షాపు, లిక్కర్‌ మార్ట్‌ మంజూరు చేయిస్తామని మాయ మాటలతో నమ్మబలికారు. ఈ రెండింటికి రూ.3 కోట్లు వరకు ఖర్చు అవుతుందని చెప్పకొచ్చారు.. ఇరువురి మాటలను నమ్మిన వెంకటేశ్వర్లు రెండు దఫాలుగా రూ.70 లక్షలు ఆర్‌టీజీఎస్‌ ద్వారా ఆన్‌లైన్‌ చేసి మళ్లీ రూ.45 లక్షలు నగదు ఇచ్చాడు. నగదు తీసుకుని రోజులు గడుస్తున్న ఎటువంటి షాపులు మంజూరు కాక పోవడంతో అనుమానం కలిగి బాధితుడు వెంకటేశ్వర్లు స్వయంగా రాష్ట్ర ఎకై ్సజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కలిసి జరిగిన విషయాన్ని తెలియజేయగా ఇరువురు వ్యక్తులు మంత్రి కొల్లు రవీంద్రకు తెలియదని చెప్పారు. దీంతో నమ్మకంగా మోసం చేశారని బాధితుడు అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నగరంపాలెం(గుంటూరు): పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. సుమారు రూ.53 లక్షల విలువైన 265 మొబైల్‌ ఫోన్లను పొగొట్టుకున్న వారికి శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటి వరకు రూ.7.53 కోట్ల విలువైన 3,679 మొబైల్‌ ఫోన్లను బాధితులకు అప్పగించామని చెప్పారు. బాధితుల ఫిర్యాదుల ఆధారం చేసుకుని సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. ఎవరైనా మొబైల్‌ ఫోన్‌ పోయినా, దొంగతనానికి గురైన వెంటనే పోలీస్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 8688831574 లేదా సీఇఐఆర్‌ వెబ్‌సైట్‌ లేదా జిల్లా సైబర్‌ సెల్‌ లేదా దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్లల్లో ఫిర్యాదులు చేయాలని ఆయన సూచించారు. ఐటీ కోర్‌ సీఐ నిషార్‌ భాషా, కానిస్టేబుళ్లు శ్రీధర్‌, మానస, ఇమామ్‌, సీసీఎస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రమేష్‌, కానిస్టేబుల్‌ కరీముల్లాను జిల్లా ఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement