కృష్ణాజిల్లా
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
గుడివాడలోని అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్నార్) కళాశాల వజ్రోత్సవాలను మంగళవారం నుంచి 18వ తేదీ వరకు నిర్వహించేందుకు కళాశాల పాలకవర్గం ఏర్పాట్లు పూర్తి చేసింది.
మచిలీపట్నంఅర్బన్: ఈ నెల 21న నిర్వహించ నున్న పల్స్ పోలియో కార్యక్రమ పోస్టర్లను కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం ఆవిష్కరించారు.
9
కృష్ణాజిల్లా జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం చేపట్టామని.. అన్ని వర్గాల ప్రజలు తమతో చేయి కలిపారన్నారు. ప్రజామోదంతో కోటి సంతకాలు చేపట్టామని, కోటి సంతకాలను గవర్నర్‌కు అందిస్తామని చెప్పారు.
ప్రజా కలం.. నిరసన గళమై నినదించింది.. సంతకాల రూపంలో తమ అభీష్టాన్ని ప్రస్ఫుటం చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు సహించబోమని చాటి చెప్పింది. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఏకంగా 4లక్షల మంది సంతకాలు చేశారు. ఈ ప్రతులను సోమవారం బందరు నుంచి భారీ ర్యాలీ నడుమ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు.
మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ చంద్రబాబు అంటేనే మోసమన్నారు. చంద్రబాబే అధికారంలో ఉండాలని కోరుకునే వాళ్లు కూడా ఇప్పుడు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రి, మాజీ పోలీస్ అధికారి వెంకటేశ్వరరావు ప్రస్తుత పాలనలోని పలు విధానాలను తప్పుపడుతున్నారన్నారని గుర్తు చేశారు.
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా


