ఇంతకూ బీచ్ ఫెస్ట్ నేటి నుంచా..రేపటి నుంచా?
మంగినపూడి బీచ్ ఫెస్ట్ ప్రారంభ తేదీని నిర్వాహకులు రెండు విధాలుగా ప్రచారం చేస్తుండటంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. నగరంలోని లక్ష్మీటాకీస్ సెంటర్‌లో బీచ్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన స్వాగత ద్వారానికి బీచ్‌ఫెస్ట్ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అయితే జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విడుదల చేస్తున్న ప్రకటనలు, కరపత్రాల్లో ఈ నెల 5వ తేదీ గురువారం నుంచే ప్రారంభమవుతున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరవుదాం అనుకునే వారు ప్రారంభ తేదీని నిర్వాహకులు రెండుగా పేర్కొంటుండటంతో గందరగోళ పడుతున్నారు.
–మచిలీపట్నంటౌన్
ఇంతకూ బీచ్ ఫెస్ట్ నేటి నుంచా..రేపటి నుంచా?


