వైఎస్సార్‌ సీపీ హయాంలో.. | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ హయాంలో..

Apr 9 2025 2:15 AM | Updated on Apr 9 2025 2:17 AM

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులను ప్రవేశపెడుతూ, ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకుని యువతకు శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంది. ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ హబ్‌ను ఏర్పాటు చేసింది. విద్యార్థుల చదువు పూర్తవగానే ఉపాధి కల్పించాలన్నది నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయం. రాష్ట్రానికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు ఏటా వచ్చే నిధుల్లో కొంత శాతాన్ని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలకు ఉపయోగించాలని అప్పటి సీఎం జగన్‌ భావించారు. ఆ దిశగానే ఐదు సంవత్సరాల్లో చాలా మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వచ్చేలా చర్యలు చేపట్టారు.

మచిలీపట్నంఅర్బన్‌: కృష్ణా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఎంప్లాయి మెంట్‌ స్కిల్‌ సెంటర్లను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. స్కిల్‌ సెంటర్లకు అందించిన కొన్ని కంప్యూటర్లను ఏపీఎస్‌ఎస్‌డీసీ అధికారులు దారి మళ్లించారు. మిగిలినవి ఆయా కాలేజీల్లో నిరుపయోగంగా పడివున్నాయి. జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏడు స్కిల్‌ హబ్‌లను ఏర్పాటు చేశారు. ఈ స్కిల్‌ హబ్‌లు ప్రస్తుతం అంతంత మాత్రంగా సాగుతున్నాయి. ఉన్న శిక్షణ కేంద్రాలను పట్టించుకోని ప్రభుత్వం కొత్తగా జిల్లాలో రెండు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో నైపుణ్య హబ్‌ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. మొవ్వలోని క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, మచిలీపట్నంలోని లేడీ యాంప్తిల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈ హబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నైపుణ్య హబ్‌లను ఇంటర్మీడియెట్‌ పరీక్షలు పూర్తయిన వెంటనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సమన్వయంతో ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రెండు కేంద్రాల్లోనూ శిక్షణ ఇప్పటికీ ప్రారంభంకాలేదు. మొవ్వ కాలేజీలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెకానికల్‌, ఆఫీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. మచిలీపట్నంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు.

చర్యలు ఏవీ?

నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాల వేటలో యువత ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే దిశగా నైపుణ్యగణన చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయాలకు నైపుణ్య సర్వే అప్పగించింది. నైపుణ్య సర్వే అమ లులో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. అయినా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోకపోవటంపై సర్వత్ర విమర్శలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడిచినా డీఆర్డీఏ ద్వారా నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనను సీడాప్‌ అమలు చేస్తున్న దీనదయాళ్‌ ఉపాధ్యాయ, గ్రామీణ కౌసల్య యోజన (డీడీయూ – జీకేవై) జిల్లాలోని ఎనిమిది ట్రైనింగ్‌ సెంటర్లలో 2024–25 సంవత్సరానికి ఎటువంటి పురోగతీ చూపలేదు. ఒక్కరికీ కూడా శిక్షణ ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే రూ.19 కోట్లు మంజూరయ్యాయని సమాచారం.

నైపుణ్య శిక్షణ కేంద్రాలనుపట్టించుకోని కూటమి ప్రభుత్వం కాలేజీల్లో ఉన్న ఎంప్లాయ్‌మెంట్‌స్కిల్‌ సెంటర్లు నిర్వీర్యం జిల్లాలోని 8 డీడీయూ – జీకేవై శిక్షణ కేంద్రాల్లో జీరో అచీవ్‌మెంట్‌ నియోజకవర్గానికి ఒక స్కిల్‌ హబ్‌ ఉన్నా శిక్షణ అంతంత మాత్రమే.. కొత్తగా స్కిల్‌ హబ్‌ల ఏర్పాటుకు మొవ్వ,బందరు జూనియర్‌ కాలేజీల ఎంపిక

3 వేల మందికి ఉపాధి కల్పనే లక్ష్యం

డీఆర్డీఏ ద్వారా నిరుద్యోగ యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో 18 డీడీయూ – జీకేవై నైపుణ్య శిక్షణ కేంద్రాలకు ప్రభుత్వం ఆమోదం లభించింది. ఇప్పటికీ 15 శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. కొత్తగా మూడు శిక్షణ కేంద్రాలను ప్రారంభించాల్సి ఉంది. ఈ ఏడాది మూడు వేల మంది నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. లక్ష్యాన్ని చేరుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

– సుమలత, డీఆర్డీఏ జాబ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌

వైఎస్సార్‌ సీపీ హయాంలో.. 1
1/3

వైఎస్సార్‌ సీపీ హయాంలో..

వైఎస్సార్‌ సీపీ హయాంలో.. 2
2/3

వైఎస్సార్‌ సీపీ హయాంలో..

వైఎస్సార్‌ సీపీ హయాంలో.. 3
3/3

వైఎస్సార్‌ సీపీ హయాంలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement