ఆర్థిక సంవత్సరం చివరిలో ప్రత్యేక డ్రైవ్
పెడన పురపాలక సంఘంలో 2024–25 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి పన్నుల వసూలుపై దృష్టి సారించాం. సచివాలయ ఉద్యోగులు, పురపాలక సిబ్బంది ద్వారా పన్నుల వసూలు చేపట్టాం. ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అధిక పన్నులు వసూలు చేశాం. వడ్డీలో 50 శాతం రాయితీ ఇవ్వడంతో మరింత ఆదాయం వచ్చింది. అందరి సమష్టి కృషి వల్ల అధిక మొత్తంలో పన్నులు వసూలయ్యాయి.
– పామర్తి వెంకటేశ్వరరావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, పురపాలక సంఘం, పెడన
●


