కృష్ణాజిల్లా
సోమవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2025
నేటి ‘మీ కోసం’ రద్దు
చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీ కోసం) పవిత్ర రంజాన్ నేపథ్యంలో రద్దు చేసినట్లు కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదివారం తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.
ఈద్ ముబారక్
నెల రోజులుగా కఠిన నియమాలతో ఉపవాస దీక్షలను పాటించిన ముస్లింలు సోమవారం పవిత్ర రంజాన్ పండుగను జరుపుకోనున్నారు.
u8లో
పెడన: ప్రస్తుతం వేసవి దృష్ట్యా నిర్మాణ రంగం ఊపందుకుంది. నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీంతో బుసక, మట్టికి మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా భవనాలు, ఎన్‌హెచ్ రోడ్లు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాల్లో మెరక పనులకు ఈ బుసకతో పాటు మట్టి ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో మూడు టన్నులుండే ట్రాక్టరు బుసక రూ.1,800పైనే పలుకుతోంది. దూరం పెరిగితే ఆ ధర మరింత పెరుగుతోంది. దీనిని అదనుగా చేసుకుంటున్న పెడనలోని మట్టి, బుసక మాఫియా చెలరేగిపోతోంది. ‘తెలుగు తమ్ముళ్లు’ అంతా తమ కనుసన్నల్లో నడిపిస్తూ.. అక్రమ దందాకు తెరలేపారు. రాత్రీ పగలూ తేడా లేకుండా సరిహద్దులు దాటించేస్తున్నారు. అయితే దందాలో తమ్ముళ్లలో వారి మధ్య వారికే ఆధిపత్య పోరు తలెత్తి.. ఒకరిపై ఒకరు అధికారులకు ఫిర్యాదులు చేసుకునే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఈ విషయాలపై అధికారులను మీడియా ప్రశ్నిస్తుంటే అటువంటి పరిస్థితి ఏమి లేదంటూ దాటవేస్తుండటం గమనార్హం.
పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో..
పెడన నియోజకవర్గంలోని పెడన, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో పెద్ద ఎత్తున బుసక, మట్టి తరలిపోతోంది. పెడన మండలంలో కొంకేపూడి, పల్లోటి స్కూలు వెనుక లే అవుట్లు దాటిన తర్వాత, కట్లపల్లి, బల్లిపర్రు, బంటుమిల్లి మండలం మణిమేశ్వరం, చోరంపూడి, ఆర్తమూరు, కృత్తివెన్ను మండలం కృత్తివెన్ను, పల్లెపాలెం, చినగొల్లపాలెం, నిడమర్రు, చినపాండ్రయ, సంగమూడి గ్రామాల నుంచి బుసక, మట్టి తరలిపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కృత్తివెన్ను మండలంలో ముమ్మరంగా పనులు జరగ్గా ప్రస్తుతం నిలుపుదల చేశారు. మళ్లీ గుట్టుచప్పుడు కాకుండా పనులు ప్రారంభించే అవకాశాలున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆధిపత్య పోరు..
పెడన మండలంలో ఒక పంచాయతీ సర్పంచ్‌కు ఇతర నాయకులకు మధ్య మట్టి పంచాయితీ ఏర్పడింది. ఆ సర్పంచ్ బుసక, మట్టి తవ్వేసి విక్రయించుకుంటుంటే మరో వర్గం నాయకులు అధికారులకు ఫిర్యాదు చేసి ఆ సర్పంచ్ వాహనాలు పట్టించారు. దీంతో ఆ సర్పంచ్ కూడా మట్టి అక్రమ తరలింపులు చేపడుతున్న బుసక టిప్పర్లకు ఎదురువెళ్లి నిలుపుదల చేసి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ పంచాయితీ స్థానిక నియోజకవర్గ ప్రజాప్రతినిధి వద్దకు చేరింది. అక్కడ కూడా తెగని విధంగా ఈ పంచాయితీ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై డివిజన్, జిల్లా స్థాయి అధికారులు దృష్టి సారించి బుసక, మట్టి మాఫియాలను నిలువరించాలని ఆయా ప్రాంతాల్లోని గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారు.
పెడన మండలం కొంకేపూడి వద్ద బుసకను తవ్వుతున్న పొక్లయినర్
పంచాయతీ చెరువులో వేలం..
7
న్యూస్‌రీల్
తనిఖీలు చేస్తున్నాం..
బుసక, మట్టి తరలిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో దాడులు చేస్తూనే ఉన్నాం. గత నాలుగు నెలలుగా పట్టుకున్న వాహనాల నుంచి అపరాధ రుసుం కింద రూ.1.20 లక్షలను వసూలు చేశాం. అయితే టిప్పర్ల ద్వారా తరలించే వాటికి ఎన్‌హెచ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి మైనింగ్ శాఖ నుంచి అనుమతులు తీసుకుని, రాయల్టీ చెల్లింపులు చేసి తీసుకువెళ్తున్నారు. స్థానికంగా రైతులు మెరక పనులు చేసుకుంటూ మట్టిని ఇళ్లకు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఈ విషయమై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మాపై ఎవరూ ఎటువంటి ఒత్తిళ్లు చేయడం లేదు. ఫిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
– కె. అనిల్‌కుమార్,
ఇన్‌చార్జి తహసీల్దార్, పెడన
పెడన, కృత్తివెన్ను, బంటుమిల్లి
మండలాల్లో మాఫియా విజృంభణ
తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లోనే అంతా..
ఆధిపత్య పోరుతో ఒకరిపై ఒకరు
ఫిర్యాదులు
చెరువులనూ వదలని వైనం
బుసక మాఫియా చెరువులను కూడా వదలడం లేదు. ఇప్పటికే చాలా పంచాయతీల్లో చెరువులను ఎండగట్టి మట్టి తవ్వుకునేందుకు ఏర్పాటు చేశారు. ఇటీవల పెడన మండలం బల్లిపర్రులో గోగులమ్మ గుడి పంచాయతీ చెరువులో బుసుక విక్రయానికి గ్రామంలో టాంటాం వేసి వేలం పాటలు నిర్వహించాలని చూశారు. పంచాయతీ చెరువులోని బుసకను విక్రయించడం ఏమిటంటూ స్థానికులు అడ్డం తిరగడంతో వేలం పాటలు నిలుపదల చేశారు.
బుసక భూచోళ్లు!
బుసక భూచోళ్లు!
బుసక భూచోళ్లు!
బుసక భూచోళ్లు!
బుసక భూచోళ్లు!
బుసక భూచోళ్లు!


