మచిలీపట్నంటౌన్: నూతనంగా వ్యాపారం ప్రాంభించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ యాజమాన్యం ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. స్థానిక వల్లూరి రాజా సెంటర్‌లో ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ అండ్ డమండ్స్ షోరూంను మంత్రి రవీంద్ర గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర వ్యాపార సంస్థలు సీఎస్‌ఆర్ ఫండ్‌ను కేవలం రెండు శాతం మాత్రమే ఇస్తాయని, మలబార్ సంస్థ ఐదు శాతం మేర ఇవ్వడం అభినందనీయమన్నారు. పోర్టు, ఇతర సంస్థల స్థాపనతో జరుగు తున్న అభివృద్ధిలో ఈ ప్రాంతానికి చెందిన ప్రైవేటు సంస్థలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. మచిలీపట్నంలో రోల్డ్‌గోల్డ్ వస్తువుల తయారీకి ప్రసిద్ధి చెందిందని రానున్న రోజుల్లో బంగారు వస్తువుల తయారీవైపు అడుగులు వేయాలని ఆకాంక్షించారు. గోల్డ్ విక్రయాల్లో దిగ్గజ సంస్థయిన మలబార్ మచిలీపట్నంలో బ్రాంచ్‌ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రిటైల్ హెడ్ రెస్ట్ ఆఫ్ ఇండియా సిరాజ్ పీకే , ఏపీ జోనల్ హెడ్ నిఖిల్ చంద్రన్, మచిలీపట్నం షోరూం హెడ్ మహమ్మద్ నస్విహ్, విజయవాడ షోరూం హెడ్ అర్జున్, బండి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
మలబార్ షోరూమ్ ప్రారంభోత్సవంలో మంత్రి రవీంద్ర


