సారా రహిత జిల్లాగా కృష్ణా | - | Sakshi
Sakshi News home page

సారా రహిత జిల్లాగా కృష్ణా

Mar 28 2025 2:09 AM | Updated on Mar 28 2025 2:11 AM

మే ఒకటి నాటికి

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాను మే ఒకటో తేదీ నాటికి నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ఎకై ్సజ్‌శాఖ ఆధ్వర్యంలో నవోదయం 2.0 – నాటుసారా నిర్మూలన కార్యక్రమంపై సమన్వయ కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సారాపై ప్రజల్లో అవగాహన కలిగించి నిర్మూలించడానికి నవోదయం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. గ్రామాలు, పట్టణాల్లో అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించి నాటుసారా వినియోగం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను ప్రజలకు వివరించాలన్నారు. నాటుసారా కాచే వారిని గుర్తించి వారి జీవనోపాధి కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం ఆర్థిక చేయూతను ఇస్తుందన్నారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిలో డీ–ఎడిక్షన్‌ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

తీవ్రమైన నేరం..

కలెక్టర్‌ డీకే బాలాజీ మాట్లాడుతూ నాటుసారా ఎవరు కాచినా, అమ్మినా తీవ్రమైన నేరంగా పరిగణించాలన్నారు. వారిపై నిఘా ఉంచాలన్నారు. అవసరమైతే పీడీ చట్టాన్ని కూడా నమోదు చేయాలన్నారు. ఎస్పీ ఆర్‌. గంగాధరరావు మాట్లాడుతూ నాటుసారా నిర్మూలనకు పోలీస్‌ యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుందన్నారు. ఎకై ్సజ్‌ డెప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో 14 గ్రామాల్లో నాటుసారా కాచి విక్రయిస్తున్నట్లు గుర్తించామని ఈ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 129 కేసులు నమోదు చేసి 73 మందిని అరెస్టు చేశామన్నారు. నాటుసారా సమాచారం అందించేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ 14405 ఫోన్‌ చేసి సమాచారం అందించాలన్నారు. అనంతరం నవోదయం పై ముద్రించిన వాల్‌పోస్టర్లు, పాంప్లేట్లను ఆవిష్కరించారు. డీఆర్వో కె. చంద్రశేఖరరావు, ఎకై ్సజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ వై. శ్రీనివాసచౌదరి, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ జి. గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు.

అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement