ఇబ్రహీంపట్నం: కృష్ణా నదిలో గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని ఫెర్రీ స్నాన ఘాట్ వద్ద ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని వయసు సుమారు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటాయని, ఎత్తు 5.7 అడుగులు ఉన్నట్లు గుర్తించారు. వంకాయ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. జేబులో ఇంటితాళాలు, రెండు చెవులకు పోగులు కలిగి ఉన్నాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 94406 27084, 90591 21109 నంబర్లకు సమాచారం అందివ్వాలని గుంటుపల్లి సెక్టార్ ఎస్‌ఐ విజయలక్ష్మి అన్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు.