చివరి తడికి పాట్లు! | - | Sakshi
Sakshi News home page

చివరి తడికి పాట్లు!

Oct 11 2026 11:43 PM | Updated on Oct 11 2026 11:43 PM

●

బొక్కివాగు ప్రాజెక్టు ఎడమ కాలువకు గండ్లు పొలాలకు చేరని సాగు నీరు ఆయిల్‌ ఇంజిన్ల ద్వారా పంటలకు నీరందిస్తున్న రైతులు

మత్తడి స్ప్రింగ్‌ ఆనకట్ట, గొల్లబాయి చెరువు కింద నీటి కష్టాలు కాలువలు సక్రమంగా లేక వరి పొట్టదశలో అవస్థలు విద్యుత్‌ కోతలతో సతమతం పొలాల వద్దే నిరీక్షిస్తున్న అన్నదాతలు

బెజ్జూర్‌ గ్రామానికి చెందిన లెండుగురి బ్రహ్మయ్య రెండు, ఎలుకపల్లి గ్రామానికి చెందిన చాటారి అశోక్‌ రెండు, కొట్రంగి సంతోష్‌ మూడెకరాల్లో వరి సాగు చేశారు. పొట్ట దశలో పంటను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. రాత్రిపూట ఇలా పొలాల వద్దే మంటలు వేసుకుని మరీ మోటార్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. ఒకరికొకరు తోడుగా ఉంటూ నాలుగు రోజులపాటు రాత్రిపూట ఇక్కడే ఉంటున్నామని చెబుతున్నారు.

బెజ్జూర్‌ మండలం ఎలుకపల్లి గ్రామానికి చెందిన కొట్రంగి భీంరావు, కొట్రంగి శ్రీనివాస్‌కు గొల్లబాయి చెరువు కింద 2 ఎకరాల 8 గుంటల వరి పొలం ఉంది. చెరువు నుంచి కాలువలు లేకపోవడంతో విద్యుత్‌ మోటార్లపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. పగటి పూట కరెంట్‌ సక్రమంగా లేకపోవడంతో రాత్రిపూట మోటార్లు వేసి పారిస్తున్నారు. పూర్తిస్థాయిలో నీరందాలంటే మూడు రోజులపాటు శ్రమించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు దుర్గం అంజన్న. పెంచికల్‌పేట్‌ మండలం ఎల్లూర్‌ శివారులోని బొక్కివాగు ప్రాజెక్టు కింద రెండెకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం పంట పొట్టదశలో ఉంది. మరో ఇరవై రోజుల్లో చేతికి రానుండగా చివరి తడికి నీరందడం లేదు. కళ్లముందే పంట ఎండిపోతుండటంతో ఆయిల్‌ ఇంజిన్‌ ద్వారా పంట పొలాలకు ప్రతిరోజూ సుమారు రూ.800 ఖర్చు చేస్తూ నీరందిస్తున్నాడు.

పెంచికల్‌పేట్‌: బొక్కివాగు ప్రాజెక్టు నిండు కుండలా ఉన్నా వరి పంటకు నీరందక ఎండిపోతున్నాయి. ప్రాజెక్టు కింద ఎల్లూర్‌, మెరెగూడ, కొత్తగూడ, పెంచికల్‌పేట్‌ గ్రామాలకు చెందిన రైతులు సుమారు 1500 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. కుడి, ఎడమ కాలువలు దెబ్బతినడంతో ప్రాజెక్టు నుంచి పొలాలకు నీరు చేరడం లేదు. దీంతో ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి అన్నదాతలు ఆయిల్‌ ఇంజిన్లతో తడులు అందిస్తున్నారు.

ఎడమ కాలువకు గండి..

ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా మెరెగూడ, కో యచిచ్చాల, ఎల్లూర్‌ శివారుల్లో పంటలకు సా గు నీరందుతుంది. గతేడాది కురిసిన భారీ వర్షాలకు కాలువ దెబ్బతిని పెద్ద గండి పడింది. ఎడ మ కాలువ కింద పంటలకు నీరందడం లేదు. కుంటలు, ఒర్రెల నుంచి రైతులు ఆయిల్‌ ఇంజి న్లతో పెడుతున్నారు. ఎకరం పొలానికి నీటిని అందించడానికి సుమారు రూ.3వేలు ఖర్చవుతుందని అన్నదాతలు వాపోతున్నారు. పొట్టదశలో ఉన్న పంట మరో 25 నుంచి 30 రోజుల్లో చేతికి రానుంది. పంటలను రక్షించుకోవడానికి అన్నదాతలు అనేక అవస్థలు పడుతున్నారు.

బెజ్జూర్‌ మండలం చిన్న సిద్దాపూర్‌ గ్రామానికి చెందిన కావుడే భీంరావు మత్తడి స్ప్రింగ్‌ ఆనకట్ట కింద వరి సాగుచేశాడు. ఆనకట్ట నుంచి పొలానికి సక్రమంగా నీరందడం లేదు. దీంతో నాలుగు రోజులుగా కాలువల చుట్టూ తిరుగుతున్నాడు. కాలువలు దెబ్బతినడంతో మధ్యలోనే నీరంతా వృథాగా పోతుందని వాపోతున్నాడు.

బెజ్జూర్‌: కొన్నిరోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలు, వర్షాలు లేకపోవడంతోపాటు అనధికార కరెంట్‌ కోతలతో అన్నదాతలు వరి పంట కాపాడుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చేతికొచ్చే దశలో ఉన్న పంటను కాపాడుకోవాలనే తపనతో పొలాల వద్దే జాగారం చేస్తున్నారు. పగలు ఎండలో శ్రమిస్తూనే.. రాత్రి పూట నిద్రను వదులుకుని సాగునీటి కోసం పరుగులు తీస్తున్నారు. బెజ్జూర్‌ మండల కేంద్రానికి అతి సమీపంలోని మత్తడి స్ప్రింగ్‌ ఆనకట్ట కింద దాదాపు వెయ్యి ఎకరాల్లో వరి సాగు చేశారు. ఆనకట్టు నుంచి సరిపడా నీరందడం లేదు. కాలువలో వచ్చే కొద్దిపాటి నీటిని తమ పొలాలకు మళ్లించుకునేందుకు రాత్రి, పగలు ప్రతిరోజూ సుమారు 40 నుంచి 50 మంది రైతులు వంతుల వారీగా కాపలా కాస్తున్నారు. అలాగే బెజ్జూర్‌ సమీపంలోని గొల్లబాయి చెరువు వద్ద కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.

కాలువలు సరిగా లేక..

మత్తడి స్ప్రింగ్‌ ఆనకట్ట కాలువలు సక్రమంగా లేకపోవడంతో నీరు పొలాలకు చేరడం లేదు. నిర్వహణ లేకపోవడం, పూడిక పేరుకుపోవడం, పలుచోట్ల దెబ్బతినడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది. చివరి ఆయకట్టు రైతుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. రాత్రివేళల్లో టార్చిలైట్లు, సెల్‌ఫోన్‌ లైట్లు పట్టుకుని కాలువల వెంట తిరుగుతూ నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తున్నారు. నీరు ఉంటే వెంటనే పొలాలకు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు పొలం వద్దకు నీరు చేరే వరకు రోడ్ల పక్కన, కల్వర్టుల వద్ద చలిమంటలు వేసుకుని, దుప్పట్లు కప్పుకుని అక్కడే నిద్రిస్తున్నారు.

రాత్రిపూట రైతులకు ముప్పు

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో సుమారు 35,600 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు అంచనా. వర్షాభావ పరిస్థితులు కొనసాగితే దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం పంటలకు నీరందించేందుకు రాత్రిపూట పొలాల వద్దే ఉంటున్న రైతులకు పాములు, విషపురుగులతో ముప్పు పొంచి ఉంది. కొందరు తాత్కాలికంగా మంచెలు ఏర్పాటు చేసుకుని అక్కడే నిద్రిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement