న్యూస్‌రీల్‌ | - | Sakshi
Sakshi News home page

న్యూస్‌రీల్‌

Oct 11 2026 11:43 PM | Updated on Oct 11 2026 11:43 PM

న్యూస్‌రీల్‌

మైనార్టీ సెల్‌ జిల్లా వైస్‌ చైర్మన్‌గా సాజిద్‌

ఆసిఫాబాద్‌అర్బన్‌: కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా వైస్‌ చైర్మన్‌గా సాజిద్‌ నియామకమయ్యారు. జిల్లాలో పార్టీ బలోపేతం, మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపా రు. తనపై నమ్మకంతో పదవి కేటాయించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మైనార్టీ సెల్‌ జిల్లా చైర్మన్‌ అర్షద్‌, నియోజకవర్గ ఇన్‌చా ర్జి శ్యాంనాయక్‌, డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు కృతజ్ఞతలు తెలిపారు.

టీఆర్‌ఎస్‌ జిల్లా కమిటీ ఎన్నిక

ఆసిఫాబాద్‌: టీఆర్‌ఎస్‌ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిరిమిల్ల వినోద్‌ చారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆ పార్టీ రాష్ట్ర అధినేత్రి ఆదేశాల మేరకు కమిటీని ఎన్నుకున్నామన్నారు. ప్రధా న కార్యదర్శిగా మాహోర్కర్‌ అశోక్‌, సంయు క్త కార్యదర్శిగా కావేటి మనోహర్‌, సంయుక్త కార్యదర్శులుగా మాచర్ల శ్రీనివాస్‌, సాయికుమార్‌, యశ్వంత్‌రావు, కోశాధికారిగా ఎండీ మోసిన్‌, మైనార్టీ సెల్‌ అధ్యక్షుడిగా మహ్మద్‌ అర్షద్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలిగా రాథోడ్‌ పుష్పలత, స్పోక్స్‌పర్సన్లుగా వినోద్‌, శశికళను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.

‘ఓపెన్‌’ ప్రవేశాలు సద్వినియోగం చేసుకోవాలి

వాంకిడి: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ డిగ్రీ ప్రవేశాలను ఇంటర్‌ పూర్తి చేసిన వారు సద్వినియోగం చేసుకోవాలని స్టడీ సెంటర్‌ కోఆర్డినేటర్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సి పాల్‌ కనకయ్య తెలిపారు. 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల గడువు ఈ నెల 13 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. బీఏ, బీకామ్‌, బీఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement