ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సీటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సహకరించాలని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ ఆదివారం హనుమకొండలో టీజీఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషనల్ టి.మధుసూదన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. అవసరమైన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన ఆయన జిల్లా ఎస్‌ఈ ఉత్తమ్ జాడెతో వెంటనే ఫోన్‌లో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సూపరింటెండెంట్ కిరణ్ మాట్లాడుతూ సిటీ స్కాన్ అందుబాటులోకి వస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.


