బెల్లంపల్లి: పట్టణంలోని కన్నాల బస్తీకి చెందిన సింగరేణి కార్మికుడు ఇరుకుల రాజు కోలిండియా స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. శుక్రవా రం బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సీఈ ఆర్ క్లబ్‌లో సింగరేణి కంపెనీ లెవెల్ బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించారు. 80 కిలోల విభాగంలో రాజు అత్యుత్తమ ప్రతి భ కనబర్చి ప్రథమస్థానంలో నిలిచాడు. మందమర్రి ఏరియా కేకే 5 గనిలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. జిమ్ నిర్వాహకుడు పి.సదానందం, జిల్లా క్యారం అసోసియేషన్ కార్యదర్శి టి.రాజన్న తదితరులు అభినందించారు.


