‘చేయూత’కు కసరత్తు! | - | Sakshi
Sakshi News home page

‘చేయూత’కు కసరత్తు!

Oct 11 2026 11:43 PM | Updated on Oct 11 2026 11:43 PM

● ఆధునిక సాఫ్ట్‌వేర్‌తో వివరాల వెరిఫికేషన్‌ ● ఇప్పటివరకు 676 మందిని అనర్హులుగా తేల్చిన అధికారులు

ఆసిఫాబాద్‌అర్బన్‌: దసరాకు చేయూత పింఛన్ల పంపిణీ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. సర్వే పూర్తి కావడంతో అర్హుల ఎంపిక ప్రక్రియను ము మ్మరం చేశారు. అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌తో సాయంతో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అనర్హుల ను ఏరివేస్తున్నారు. వివిధ అంశాలను సరిపోలుస్తూ వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలతోపాటు 15 మండలాల్లో చేయూత పింఛన్ల కోసం మొత్తం 9,466 దరఖాస్తులు వచ్చాయి. అధికారులు 9,458 దరఖాస్తులను ట్యాగ్‌ చేశారు. ఇందులో 8,313 మందిని అర్హులుగా గుర్తించగా, 676 మందిని అనర్హులుగా తేల్చారు. మరో 406 దరఖాస్తులను హోల్డ్‌లో ఉంచగా, 63 దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు.

అన్ని కోణాల్లో విచారణ

అనర్హుల ఏరివేతకు అధికారులు అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ వినియోగిస్తున్నారు. దరఖాస్తుదారులకు భూ ములు, వాహనాలు, ఇతర ఆస్తులు ఉన్నాయా.. అని ఆరా తీస్తున్నారు. యాప్‌ ద్వారా భూములు, వాహనాలకు ఆధార్‌కార్డు లింక్‌ ఉంటే తక్షణమే తెలిసిపోతుంది. దరఖాస్తుదారుల ఆర్థిక స్థితిగతులను కచ్చితంగా అంచనా వేస్తున్నారు. కుటుంబ నేపథ్యం, డిపాజిట్ల వివరాలు, దరఖాస్తుదారుల పేరిట కార్లు, వాణిజ్య వాహనాల వివరాలు సేకరిస్తున్నారు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల పరిమితి ఉన్న విషయం తెలిసిందే. దసరా పండుగ కానుకగా పింఛన్లు మంజూరు చేయాలని భావిస్తుండటంతో మొదట ఈ యాప్‌ ద్వారా అన్నింటినీ పరిశీలిస్తున్నారు. పొరపాట్లు ఉంటే సవరిస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement