బీటీ రోడ్డు మంజూరు చేయాలి
కెరమెరి: మండలంలోని తెలంగాణ, మహారాష్ట్ర సరి హద్దులోని పరంధోలి తదితర గ్రామాలకు వెళ్లేందు కు ఉమ్రి క్రాస్ రోడ్డు నుంచి బీటీ రోడ్డు నిర్మించాల ని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేశ్ శనివారం ఎంపీ గోడం నగేశ్‌ను కో రారు. జిల్లా కేంద్రంలోని ఆయన గృహంలో కలిసి వినతపత్రం అందించారు. ముకదంగూడ, పరంధో ళి గ్రామపంచాయతీలకు త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. త్రీఫేజ్ విద్యుత్ సరఫరా లేక పంటలకు సాగునీరు అందడంలేదని తెలిపారు. శంకర్‌లొద్ది అటవీ ప్రాంతంలో కొలువుదీరిన కప్లై పుణ్యక్షేత్రంలోని గుహ వద్ద విశ్రాంతి గదిని ఏర్పా టు చేయాలని కోరారు. శంకర్‌లొద్ది, మహరాజ్‌గూ డ గ్రామాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


