వివరాలు నమోదు చేయాలి
కౌటాల: రైతుల వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పకుండా నమోదు చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బీ వెంకట్ సూచించారు. మండలంలోని నాగేపల్లి గ్రామంలో శనివా రం ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల పథకాల ద్వారా ప్రయోజనం పొందవచ్చ ని తెలిపారు. రైతులంతా ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్‌తో సంబంధిత ఏఈవో లేదా మీ సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. సర్పంచ్ కావుడే బిక్కు, ఏవో ప్రేమలత, ఏఈవో అంజన్న, రాజేశ్వర్, ఘన్‌శ్యాం, కల్పన, రైతులు పాల్గొన్నారు.


