దక్షిణ భారతస్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపిక
ఆసిపాబాద్: జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు, విద్యార్థి దక్షిణభారత స్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల విభాగంలో కాగజ్‌నగర్ పెట్రోల్ పంప్ జెడ్పీ సెకండరీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడు మామిడాల తిరుపతయ్య, విద్యార్థుల విభాగంలో జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ఎస్.ప్రవీణ్‌కుమార్ హరిత శక్తి విభాగంలో ప్రతిభ చాటారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా సైన్స్ అధికారి కటుకం మధూకర్ వీరిని అభినందించారు. ఈ నెల 19నుంచి 23వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న దక్షిణ భారత స్థాయిలోనూ జిల్లా ప్రతిష్టను నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఎంపికై న అభ్యర్థులు ఈ నెల 18న రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారిని సంప్రదించాలని సూచించారు.
తిరుపతయ్యను అభినందిస్తున్న దీపక్ తివారి
ప్రవీణ్‌కుమార్‌ను అభినందిస్తున్న ఉపాధ్యాయుడు
దక్షిణ భారతస్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపిక


